రియల్ హీరో.. ఆపరేషన్ థియేటర్ లో ఎందుకలా పడుకున్నాడు? | Hero surgeon sleeps hospital floor.

Surgeon is hailed a hero after collapsing asleep on hospital floor

Chinese Surgeon, Luo Heng, Luo Heng Sleep, Anhui province Dingyuan Hospital, Hero Surgeon, Doctor Sleep Floor, Chinese Surgeon Sleep, 28-hour Shift, Non Stop Surgeons,

Chinese surgeon Luo Heng called a hero after being pictured sleeping on floor of hospital after 28-hour shift in Anhui province.

సోషల్ మీడియాతో ఆ డాక్టర్ దేవుడయ్యాడు

Posted: 04/11/2017 10:26 AM IST
Surgeon is hailed a hero after collapsing asleep on hospital floor

ఒక వ్యక్తి మళ్లీ ప్రాణాలు పోసే సత్తా ఒక్క వైద్యుడికే ఉంది. అయితే అందులోనూ అవినీతి మలినం, డబ్బు పిచ్చి ఉండటం అప్పుడప్పుడు కొన్ని ఉదంతాలతో చూస్తుంటాం. ఎక్కడో ఒక దగ్గర లుయో హెంగ్ లాంటి మంచోళ్లు కూడా ఉండి ఉంటారు. ఇంతకీ ఇతని గురించి చెప్పలేదు కదా. తన ఆరోగ్యం దెబ్బ తిన్నా ఫర్వాలేదుగానీ పెషెంట్ల ప్రాణాలు కాపాడాలన్న అతని నిబద్ధతకు ఇప్పుడు అంతా హాట్సాఫ్ చెబుతున్నారు.

చైనాకు చెందిన  లుయో హంగ్ అన్ హుయి ప్రోవిన్స్ లోని ఓ ఆస్పత్రిలో సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఫోటో ఒకటి నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అతనో ప్రముఖ వైద్యుడు అయినా సాదాసీదాగా నేల మీద పడుకుని ఉండటమే అందుకు కారణం. దాని వెనకాల పెద్ద స్టోరీ యే ఉంది. లుయో హెంగ్ మార్చి 30న రాత్రి రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశాడు. అదయ్యాక మరో ముగ్గురు పెషెంట్లకు ఆపరేషన్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి దాపురించింది. నిద్ర ముంచుకొస్తున్నా సరే ప్రాణాలు ముఖ్యమంటూ వారికి ఆపరేషన్లు చేసేశాడు. ఆపై మరో సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది.

అలా ఏకధాటిగా 28 గంటలపాటు ఐదు ఆపరేషన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాక అక్కడే ఆపరేషన్ థియేటర్ లో ఇదిగో ఇలా కుప్పకూలిపోయాడు. అతను అలా నిద్రపోతున్న సమయంలో ఫోటోలు తీసి ఎవరో ఫేస్ బుక్ లో పెట్టగా, గ్లోబల్ టీవీ నెట్ వర్క్ విషయం తెలిసి అతనిపై కథనం ప్రచురించింది. కనిపించని దేవుడి కన్నా ఇలా మనుషుల ప్రాణాలు కాపాడే వ్యక్తి చాలా గొప్పవాడంటూ పేర్కొంటూ అతని ఫోటోలను షేర్ చేస్తున్నారు.

China Hero Surgeon Sleep Floor

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese  Hero Surgeon  Sleep on Floor  

Other Articles