బ్యాలెట్ ఎన్నికలను నిర్వహించాలన్న పార్టీలు.. Congress demands voting machine use be stopped immediately

After evm controversy poll panel s political comment uncalled for

election commission, nasim zaidi, evm tampering, UP polls, UP Elections, uttar pradesh elections, BSP, BJP, SP, Mayawati, akhilesh yadav, AAP, Arvind kejriwal

After the UP election, there was a marathon five-hour debate in Rajya Sabha on electoral reforms, where half the time was taken up by the EVM

నిండు కోలువులోనూ అవే అరోపణలు.. పాత పద్దతికే డిమాండ్

Posted: 04/05/2017 11:18 AM IST
After evm controversy poll panel s political comment uncalled for

నిండుకొలువులో కూడా బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి తన మాటకు కట్టుబడి బీజేపిపై విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్ లో తమ పార్టీ ఘోర పరాజయానికి, బీజేపి ఏకపక్ష విజయానికి కారణం కేవల ఈవీఎంల ట్యాపరింగ్ మాత్రమేనన్నారు. ఎన్నికల సంస్కరణల విషయమై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చించేందుకు సభా చైర్మన్ ఐదు గంటల పాటు సమాయాన్ని కేటాయించగా, అందులో దాదాపుగా రెండున్నర నుంచి మూడు గంటల పాటు కేవలం ఈవీఎం మెషీన్ల ట్యాపరింగ్ పైనే చర్చ జరిగింది.

ఈ సందర్భంలోనూ రాజ్యసభ సాక్షిగా మాయావతి అధికార బీజేపి ప్రభుత్వంపై అవే అరోపణలను గుప్పించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అంశంపై చర్చిస్తూ.. వాటి ద్వారా రిగ్గింగ్ కు పాల్పడే అంశమై ప్రస్తావించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఈవీఎం ట్యాంపరింగేనని అరోపించారు. అ తరువాత అప్ ఎంపీలు కూడా అదే తరహా అరోపణలు గుప్పించారు. తమకు రావాల్సిన ఓట్లను బీజేపి తమ ఖాతాలో వేసుకుందన్నారు.

దీంతో కాంగ్రెస్ ఎంపీ అజాద్ మాట్లాడుతూ..మళ్లీ బ్యాలెట్ విధానాన్నే ఎన్నికలలో ప్రవేశపెట్టాలని సూచించారు. ఈవీఎం మెషీన్లపై పార్టీలో అందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మళ్లీ పాత విధానానికి వెళ్లడమే.. దానిని అనుసరించడమే మేలని ఆయన అన్నారు. కాగా బీజేపి మాత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన అరోపణలు తిప్పికోట్టింది. ఈవీఎం మెషీన్ల ట్యాపరింగ్ జరగలేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంపై దాడి చేయడం సహేతుకం కాదని తెలిపింది.

కాగా, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో ఈవీఎం మెషిన్లను ట్యాంపరింగ్ చేసిన అధికార బీజేపి పార్టీ అందుచేతనే అధికారంలోకి వచ్చిందని ఎన్నికల ఫలితాలు వెలువడగానే అరోపించిన మాయావతి.. ఆ తరువాత పలు సందర్భాలలో కూడా ఇవే అరోపణలను సంధించారు. అదే సమయంలో పంజాబ్ లో తమ పార్టీకి రావాల్సిన ఓట్లను బీజేపి-అకాళీదళ్ పార్టీలు తన్నుకుపోయాయని అమ్ అద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ము్యమంతర్ి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరోపించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఈవీఎం మెషీన్లలలో అవకతవకలు జరిగినట్లు అరోపణలు వస్తున్న వేళ.. అటు కేంద్రంపై నిత్యం విరుచుకుపడే తృణముల్ కాంగ్రెస్ కొంత శాంతం వహించి.. మంచి సూచనను చేసింది. పలు రాష్ట్రాల పార్టీలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అరోపణలు గుప్పిస్తున్నప్పడు. కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకని వీటిపై అల్ పార్టీ మీట్ ఏర్పాటు చేసి.. అవకతవకలు లేవని నిరూపించకూడదని మమత బెనర్జీ ప్రశ్నించారు.

ఈవిఎం మెషీన్ల ట్యాంపరింగ్ జరుగుతుందన్న అంశంలో తమ నిర్ణయం తమకు వున్నదనిని అయితే బీజేపి రాజ్యసభ సభ్యుడు.. అన్ని విషయాలపై అవగాహన కలిగిన వ్యక్తిగా పేరొందిన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈవీఎం మెహీన్లు ట్యాంపరింగ్ జరుగుతుందని గతంలోనే చెప్పారని, ఈ మేరకు ఆయన మాట్లాడిని వీడియోనూ కూడా మీడియాకు ప్రదర్శించిన మమత.. ఇది నిజం కాదని స్పష్టం చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘం అధికారులపైనే వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles