ఏది నొక్కినా బీజేపీకే ఓటు.. ఎలా పడుతుందో తెలుసా? | How EVM Dispenses Only BJP Slips During Trial.

Bhanwar lal on madhya pradesh evm tampering

Bhanwar Lal, CEO Bhanwar Lal, Bhanwar Lal Madhya Pradesh EVM Tampering, EVM Tampering, EVM Trial, EVM Tampering Controversy, EVM Tampering Issue, AP Election Commissioner, BJP EVM Tampering

Andhra Pradesh Chief Election Officer Bhanwar lal clarify on EVM tampering issue in Madhya Pradesh. It is only officials negligence.

ఆ మెషిన్లు ఎలాంటి తప్పు చేయలేదంట!

Posted: 04/05/2017 11:22 AM IST
Bhanwar lal on madhya pradesh evm tampering

మధ్యప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం) లు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. త్వరలో అక్కడ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల జరగనున్న వేళ, వివిధ పార్టీ ఏజంట్ల ముందు ఈవీఎంలను ప్రదర్శించటం, అది కాస్త ఎవరికి నొక్కినా బీజేపీకే పడుతున్నట్టు చూపించటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్యరావ్ సింధియా, ఆప్ అధినేత కేజ్రీవాల్ లు హుటాహుటినా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అధికారం అండతో బీజేపీ ఈవీఎంలను టాంపరింగ్ చేస్తున్నారంటూ అధికార పక్షంపై ఫిర్యాదులు కూడా చేశారు.

దీంతో తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ నియమించగా, ఆయనే స్వయంగా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ట్యాంపర్ అయినట్టు చెప్పబడుతున్న ఈవీఎం ఎందుకలా ప్రవర్తించిందన్న విషయాన్ని తమ సాంకేతిక నిపుణులు గుర్తించారని తెలిపారు. ఇక్కడ చూపిన ఈవీఎం ఇటీవలి ఉత్తరప్రదేశ్, కాన్పూర్ పరిధిలోని గోవిందనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో వాడారు. సాధారణంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి విజేతను ప్రకటించాక, అందులోని వీవీపీఏటీ (వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్)లో డేటాను చెరిపేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ అలా జరగలేదు.

అదే మెషిన్ ను డెమో కోసం వాడారు. అందుకే ఏది నొక్కినా బీజేపీ అభ్యర్థికే పడినట్లు చూపించిందని భన్వర్ లాల్ వివరించాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదని, కేవలం అదికారుల నిర్లక్ష్యమే ఇక్కడ కారణమని తెలిపాడు. ఇక ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు 150 ఈవీఎంల డిమాన్ స్ట్రేషన్ కు ఏర్పాట్లు చేశామని భన్వర్ లాల్ స్పష్టం చేశాడు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముగ్గురిని బదిలీ చేశామని, మరో 19 మందిపై విచారణ ప్రారంభమైందని వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  EVM tampering  Bhanwar Lal  

Other Articles