భారతీయ మహిళను బట్టలిప్పమని అదేశించిన అధికారులు Bengaluru woman ordered to strip at Frankfurt airport

Indian woman asked to take off dress at frankfurt airport

frankfurt airport,strip searched, indian woman, indian woamn strip search, indians harassed, indian-origin woman harassed, racial profiling, germany airport

Shruthi Basappa, Indian woman from Bengaluru travelling to Iceland was asked to take off her clothes for a body search at the Frankfurt airport, who narrated her ordeal on Facebook.

భారతీయ మహిళను బట్టలిప్పమని అదేశించిన అధికారులు

Posted: 04/02/2017 03:16 PM IST
Indian woman asked to take off dress at frankfurt airport

అగ్రరాజ్యంలో జాత్యాహాంకారాలు పెల్లుబిక్కి మనదేశా పౌరులపై మానప్రాణాలకు రక్షణ విషయంలో అందోళన రేకెత్తుతున్న తరుణంలో అదే తరహా అహంకారాలు తాజాగా జర్మనీకి కూడా పాకాయి. జర్మనీలోని ప్రాంక్ పర్డ్  విమానాశ్రయంలో ప్రవాస భారతీయురాలు శ్రుతి బసప్ప (30)కు తీవ్ర అవమానం జరిగింది. ఐస్ లాండ్ జాతీయుడిని వివాహమాడిన ఆమె ఆరేళ్లుగా అక్కడే ఉంటున్నారు. గత నెల 29న శ్రుతి భర్తతో కలిసి జర్మనీ మీదుగా భారత్ వస్తున్నప్పుడు ప్రాంక్ పర్డ్  విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఘోరంగా అవమానించారు.

ఇప్పటికే ఎయిర్ పోర్టులో ప్రిక్సింగ్ లపై అనేక అరోపణలు వస్తున్న తరుణంలో భారతీయులే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయి. ప్రవాసభారతీయురాలి విషయంలోనూ అదే జరిగింది. శ్రుతి బసప్పను ప్రాంక్ పర్డ్ విమానాశ్రయ సిబ్బంది ప్రిక్సింగ్ పేరుతో ఘోరంగా అవమానించారు, పూర్తిగా దుస్తులు విప్పేయమని అడిగారు. అయితే రెండు వారాల క్రితమే తనకు పొత్తికడుపు ఆపరేషన్ కావడంతో ‘ప్యాంట్ డౌన్ చెక్’ జాగ్రత్తగా చేయాలని సెక్యూరిటీ సిబ్బందిని శ్రుతి కోరారు. ఆపరేషన్ పత్రాలు చూపించబోతుంటే నిరాకరించిన సిబ్బంది దుస్తులు విప్పేసి చూపించాలని అడగడంతో ఆమె హతాశురాలైంది.

 దీంతో తన భర్త ఎదుటే తనను చెక్ చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనను పిలిపించారని, ఆయన యూరోపియన్ అని తెలియడంతో నిబంధనలు ఒక్కసారిగా మారిపోయాయని శ్రుతి తెలిపారు. ప్యాంట్ డౌన్ చెక్ సరిపోతుందని చెప్పి పంపించారని పేర్కొన్నారు. తన శరీరం రంగు కారణంగానే విమాన  సిబ్బంది తరచూ తనను ‘ర్యాండమ్ చెక్’కు ఎంచుకుంటున్నారని శ్రుతి ఆరోపించారు. యూరోపియన్లను బాడీ  స్కానింగ్ చేసి వదిలేస్తే తనను వళ్లంతా తడిమి (ప్యాంట్ డౌన్ చెక్) చేసేవారని తెలిపారు. సిబ్బంది తీరు జాతివివక్ష కిందకు వస్తుందంటూ విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శ్రుతి ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles