క్యాబినెట్ లో చేరిన నారా లోకేష్.. ముగిసిన ప్రమాణస్వీకారం CM chandrababu naidu’s son Nara Lokesh takes oath as Minister

Cm chandrababu naidu s son nara lokesh takes oath as minister

Andhra Pradesh, Cabinet expansion, Nara Lokesh, Chandrababu Naidu, bhuma akhila priya, somireddy chandramohan reddy, pitani satyanarayana,

Chief Minister N. Chandrababu Naidu on Sunday inducted his son Nara Lokesh and 10 others into the Cabinet, while dropping five Ministers.

క్యాబినెట్ లో చేరిన నారా లోకేష్.. ముగిసిన ప్రమాణస్వీకారం

Posted: 04/02/2017 02:29 PM IST
Cm chandrababu naidu s son nara lokesh takes oath as minister

ఏపీ మంత్రిగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ లోకేష్ తో ప్రమాణం చేయించారు. తన ప్రమాణ స్వీకారం అయిపోయిన తరువాత, తండ్రి చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్న లోకేష్ ను గవర్నర్ అభినందించారు. ఆపై పితాని సత్యనారాయణ ప్రమాణం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన పితాని, గతంలోనూ మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆ తరువాత గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న నక్కా ఆనంద్ బాబు, ఆ తరువాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విజయనగరం జిల్లా నేత సుజయకృష్ణ రంగారావు, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యేగా వున్న కాల్వ శ్రీనివాసులు, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డిలు మంత్రిగా ప్రమాణం చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడైన కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ ప్రమాణ స్వీకారం చేశారు,

వీరితో పాటు చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ అమర్ నాథ్ రెడ్డి, ప్రమాణం చేశారు. ఆపై ప్రస్తుత క్యాబినెట్ లో అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డును సృష్టిస్తూ, 28 ఏళ్ల వయసులోనే భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియ, తల్లి శోభ మృతితో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తేూ తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చి తడబాటుకు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles