మైనర్ బాలిక బ్లాక్ మెయిల్.. పలుమార్లు అత్యాచారం Engineering student arrested on rape, blackmail charge

Engineering student arrested on rape blackmail charge

Engineering student, Shiva kumar, sexually assault, minor girl, POCSO Act, filmed video, blackmail, Khade Bazaar police, crime

Police have arrested a Engineering student on charges of sexually assaulting a minor girl and booked under POCSO Act

మైనర్ బాలిక బ్లాక్ మెయిల్.. పలుమార్లు అత్యాచారం

Posted: 04/01/2017 01:26 PM IST
Engineering student arrested on rape blackmail charge

మాయమాటలతో అభంశుభం తెలియని అమాయక మైనర్ బాలికలను లొంగదీసుకుని.. వారితో ఏకంతంగా గడిపి ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసిన పైశాచిక మృగం ఘటన బెంగళూరులో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి మైనర్ బాలికలని కూడా చూడకుండా వారిపై పలు పర్యాయాలు అత్యాచారాలకు పాల్పడుతూ అదిచాలదన్నట్లు బ్లాక్ మెయిల్ కూడా చేయడంతో ఎట్టకేలకు ఈ మగమృగం ఆటను కట్టించారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాం నగరంలో వెలుగుచూసింది.  

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్గాం నగరంలోని బాళెకుంద్రి ఇంజినీరింగ్ కళాశాల్లో రెండవ సంవత్సరం చదువుతున్న శివకుమార్ బాళెకుంద్రి (22) అమాయక మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుని వారిని లొంగదీసుకుంటాడు. ఇదే క్రమంలో తాను నివాముంటున్న బెల్గం నగరంలోని ఓ ఏడవ తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి.. తినుబండారలు, చాకెట్ల అశచూపి లొంగదీసుకున్నాడు. ఆ తరువాత బాలికను బెదిరించి కామవాంఛ తీర్చుకున్నాడు.

అనంతరం ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ లో  రికార్డు చేశాడు. తర్వాత ఆ దృశ్యాలను బయట పెడతానని బ్లాక్ మెయల్ చేస్తూ మైనర్ బాలికపై పలు పర్యాయాలు అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే ఓ సారి శివకుమార్ తన కోర్కె తీర్చాలని డిమాండ్ చేయగా, అందుకు బాలిక అంగీకరించలేదు. దీంతో తన సెల్‌ఫోన్ లో చిత్రీకరించిన బాలికతో తాను సన్నిహితంగావున్న దృశ్యాలను పాఠశాలలోని కొందరు బాలికలకు చూపించాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles