పెళ్లి తరువాత శుభకార్యం కానిచ్చి.. పోస్టులో తలాక్.. man arrested for sending talak in post after first night

Man arrested for sending talak in post after first night

kukatpally police, talak after first night, mohammed haneef, divorce after first night, talak in post, one day, marriage, farheen begum, bahaarunissa, crime

kukatpally police arrested mohammed haneef, for sending divorce (talak) in post after first night to his newly married second wife farheen begum

పెళ్లి తరువాత శుభకార్యం కానిచ్చి.. ఆ వెంటనే పోస్టులో తలాక్..

Posted: 04/01/2017 12:46 PM IST
Man arrested for sending talak in post after first night

పెళ్లంటే నిండి నూరేళ్ల పంట అన్న పెద్దల మాటలను అపహాస్యం చేస్తూ హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి లోని ఓ వ్యక్తి పెళ్లిన తరువాత శుభకార్యాన్ని కానిచ్చి.. తన భార్యకు విడాకులు పంపించాడు. తన అరోగ్యం సరిగా లేదని సాకులు చెబుతూ పోస్టు ద్వారా భార్యకు విడాకులను పంపాడు. దీంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు స్థానిక పోలీసులను అశ్రయించడంతో ఒక్క రోజు మోజు కోసమే పెళ్లి చేసుకున్నాడా..? అన్న అనుమానాలు ఓ వైపు తలెత్తుతున్న సమయంలోనే నిందితుడన్ని అరెస్టు చేసి కటకటాలా వెనక్కి నెట్టారు పోలీసులు.

కూకట్ పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లి పరిధిలోని ప్రకాశం పంతులునగర్‌ ప్రాంతంలో నివ‌సించే వివాహితుడైన మహమ్మద్ హనీఫ్ కు బాహదురున్నీసాతో గతంలో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆగ సంతానం కూడా వున్నారు. అయతే తనకు మగ సంతానం కావాలని తన భార్యపై ఒత్తిడి తీసుకువచ్చి రెండో వివాహం చేసుకునేందుకు అంగీకరించేలా చేశాడు. అమెకు అనేక పర్యాయాలు గర్భస్రావం కావడం.. పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చిచెప్పడంతో.. భర్త కోరికకు అంగీకరించింది.

అనంత‌రం తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్‌ బేగంను ఫిబ్రవరి 9న మొఘల్‌పురాలోని కన్వీల్లా ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొద‌టి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడంతో వివాహం చేయడానికి ఖాజీ అంగీకరించలేదు. దీంతో దానిని పెళ్లైన వెంటనే సమర్పిస్తానని చెప్పాడంతో అందుకు అంగీకరించిన ఖాజీ వారి వివాహం చేశారు. వివాహం తరువాత కానిచ్చే శుభకార్యం పూర్తి చేసుకున్న తరువాత తన రెండో భార్యను తన నివాసానికి సమీపంలోనే అద్దెకు ఇంటిని తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు.

అయితే, రెండో భార్య‌తో తాను దాంపత్య జీవనం సాగించాలంటే మొదటి భార్యకు విడాకులివ్వాలి. అది ఇష్టంలేని హనీఫ్ తన రెండో భార్యను వదులుకునేందుకు సిద్దమయ్యాడు. రెండో భార్య‌కు ఫోన్‌ చేసి తాను అనారోగ్యం కార‌ణంగా ఆసుపత్రిలో చేరానని, ఆమెను తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని చెప్పాడు. మార్చి నెల 19న ఇక కథకు ముగింపునిద్దామనుకున్న హానీఫ్ తన రెండో భార్య ఫర్హీన్ కు పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. విడాకుల ప‌త్రం చూసిన ఫ‌ర్హీన్ షాక్ అయింది.

త‌న‌కు ఫర్హీన్ తో పెళ్లి ఇష్టం లేదని, అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నాన‌ని మ‌హ్మ‌ద్ అందులో పేర్కొన్నాడు. దీంతో పర్హీన్ కుటుంబసభ్యలు స్థానిక పోలీసులను అశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇద్దరి భార్యలతో సంసారం చేయాలన్న అతని కాంక్షను భయటకు చెప్పకుండా.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని అబ్దదం చెప్పండతో పాటు అమెను వదిలిపెట్టేందుకు అయిష్గత వ్యక్తం చేయడం కారణంగా హనీఫ్ కటకటాల వెనక్కు వెళ్లాడని పోలీసులు తెలిపారు. అబద్దాలతో జీవితాన్ని సాగించలేదరిని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles