ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో ఆయనకు బాగా తెలుసు..Double bedroom house beneficiary thanks KCR

Double bedroom house beneficiary thanks kcr

double bedroom house beneficiary, Nagamani, Telangana Chief Minister, K. Chandrasekhar Rao, State government, Minister T. Nageswara Rao, Maddulapalli village, Khammam district

A double bedroom house beneficiary, Nagamani, expressed gratitude to Chief Minister K. Chandrasekhar Rao over the phone for the benefit bestowed on her by the State government.

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో ఆయనకు బాగా తెలుసు..

Posted: 03/31/2017 12:00 PM IST
Double bedroom house beneficiary thanks kcr

శీర్షిక చూసి ఏదో సినిమా గురించి చెబుతున్నామని భావిస్తే తప్పులో కాలేసినట్లే.. మేము చెబుతున్నది అక్షారాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించే. తాను పట్టిన కుందేలు నాలుగు కాళ్లు వున్నాయని ఎందరు చెప్పినా.. అందరినీ ఒప్పించి మెప్పించి మూడుకాళ్లే అని చెప్పించగల సమర్ధుడు. సత్తాకలిగినవాడు ఆయన. తన ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నా.. వారిపై విమర్శలు సంధిస్తూనే అటు లబ్దిదారులను మాత్రం తన పార్టీకి, ప్రభుత్వానికి రుణపడి వుండేలా చర్యలు తీసుకోవడంలో ఘనాపాటి రాజకీయవేత్త అయన.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం సర్వే చేయించిందని, గతంలో కన్నా అధికంగా తమకు స్థానాలు వస్తాయని, ఎన్నికల కోసం అలోచిస్తూ తాము పనిచేయాల్సిన అవసరం లేదని.. తాము చేసూవన్నీ ప్రజాహిత కార్యక్రమాలేనని చెప్పుకున్న అయన.. తాజాగా ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి గ్రామినికి చెందిన డబుల్ బెడ్ రూం లబ్దిదారురాలికి ఫోన్ చేసి సంబాషించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎలావుంది.. ఇంట్లోని వసతులు ఎలా వున్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.

పనిలోపనిగా గతంలో అమెకు ఇల్లు వుందా..? అని కూడా అరా తీసిన కేసీఆర్.. అమె ద్వారా మద్దులపల్లిలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా వున్నాయని కూడా తెలుసుకున్నారు. అమెతో పాటుగా ఇంకా గ్రామాంలో ఎంతమంది ఒంటరి మహిళలు వున్నారని కూడా సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. చివరగా డబుల్ బెడ్ రూం ఇంటిపై నాగమణి అభిప్రాయాన్ని కూడా సీఎం తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా తాము ఊహించనదానికి మించిన రెండు పడకల ఇంటిని తమకు కేటాయించిన ముఖ్యమంత్రికి రుణపడి వుంటామని నాగమని చెప్పింది. దీంతో ఇక తమకు కూడా సీఎం నుంచి ఫోన్ కాల్ వస్తుందని అనేక మంది లబ్దిదారులు వేచిచూస్తున్నారు. ఇక నాగమణి సంతోషానికి మాత్రం అవధులు లేకుండాపోయాయి. దీంతో అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సీఎం చేసిన ఫోన్ కాల్ ను స్వాగతిస్తూ.. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తమ ముఖ్యమంత్రికి తెలుసునంటూ కితాబిచ్చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles