లోకేష్ మరో కేటీఆర్ అవుతాడా? | Nara Lokesh get KTR ministry.

Nara lokesh confirmed ministry in re shuffle

Chandrababu Naidu, Chandrababu Naidu Cabinet, Cabinet Re Shuffle, Nara Lokesh AP Cabinet, Minister Nara Lokesh, Nara Lokesh Ministry, AP Cabinet Re Shuffle, Bhuma Minister Akhila Priya

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu to induct his son Nara Lokesh into the cabinet. Re Shuffle Muhurtham on April 2nd at 9.25 am. Lokesh likely to get Panchayath raj or IT. 10 members may swear as Ministers.

నారా లోకేష్ కు ఆ శాఖనే కట్టబెడతారా?

Posted: 03/31/2017 08:34 AM IST
Nara lokesh confirmed ministry in re shuffle

ఎట్టకేలకు నవ్యాంధ్రలో తొలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ముందుగా చెప్పుకున్నట్లు ఏప్రిల్ 2 ఆదివారం ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. వెలగపూడిలో అసెంబ్లీ భవనం ప్రాంగంలో ఈ కార్యక్రమం ఉండబోతుందని, ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలకు ప్రభుత్వం సమాచారం అందించిందని తెలుస్తోంది. కాపు, రెడ్డి సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ ఉండబోతుందని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇక నలుగురికి ఉద్వాసన ఖాయంగా కాగా, ఖాళీగా ఉన్న 6 తో కలిపి మొత్తం పది మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్సు ఉంది..

కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తోపాటు, భూమా కూతురు అఖిలప్రియలకు బెర్తులు దాదాపు ఖరారు అయ్యాయి. మరో సీనియర్ నేత సొమిరెడ్డి పదవి కోసం గట్టిగానే యత్నిస్తున్నట్లు సమాచారం. ఇక లోకేశ్ కు ఐటీ లేదా మున్సిపల్ పంచాయితీరాజ్ శాఖను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ ఇవే శాఖలను నిర్వహించడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

ఒకవేళ పంచాయితీ శాఖ ఇస్తే గనుక ఆ శాఖను నిర్వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకు మరోకటి కేటాయించే అవకాశం ఉంది. ఉద్వాసన లిస్ట్ తోపాటు ఆశావహుల జాబితాలో కూడా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కిమిడి మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె సమీప బంధువు కిమిడి కళావెంకట్రావుకు చాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు పేరు వినిపిస్తోంది. రావెల కిషోర్‌బాబును తప్పిస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే వి.అనిత, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మహిళ విభాగంలో ఫైర్ బ్రాండ్ అనిత, సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే డేవిడ్ రాజుకు అవకాశం దక్కవచ్చు. పీతల సుజాత స్థానంలో వేరొకరిని తీసుకోవాలనుకుంటే నక్కా ఆనందబాబు, గొల్లపల్లి సూర్యారావు శ్రావణ్‌ కుమార్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి బొజ్జలను తప్పిస్తే అమర్‌నాథ్ రెడ్డికి చోటు ఖాయమని అంటున్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు, అనంతపురం నుంచి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకే పార్థసారథిలలో ఒకరికి అవకాశం రానుంది. జగన్ ఇలాకా కడపపై ఫోకస్ చేసిన చంద్రబాబు అక్కడి బాగా సత్తా ఉన్న నేతకు పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Cabinet Reshuffle  Nara Lokesh  Akhila Priya  

Other Articles