పులి నోట్లో పిల్లాడు... ఆ తల్లి ఎలా పోరాడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు | How a courageous mother drove away a leopard.

Brave mom pounces on leopard to save son

Mumbai Mother, Mother Fight Leopard, Leopard Snatch Kid, Leopard Woman Fight, Mumbai Brave mother, Woman Leopard, Pramila Rinjad Cheetah, Woman Fight Cheetah, India Cheetah Atatck, Aarey Colony Leopard Attack, Brave Mother Save Son

A courageous young mother drove off a leopard that threatened to grab her son in the tribal hamlet of Chafa, in Mumbai's Aarey Colony, on Monday. Pramila Rinjad, 23, was on her way to the bathroom that abutts her home along with her three-year-old son Pranay when the duo were attacked by the leopard.

అమ్మకు గుండె ధైర్యం చాలా ఎక్కువే!

Posted: 03/23/2017 12:54 PM IST
Brave mom pounces on leopard to save son

కడుపుతీపి కన్నా తల్లులకు ముఖ్యమైంది ఏదీ కాదని మరో ఘటన నిరూపించింది. తన మూడేళ్ల చిన్నారి ప్రాణాల కోసం ఓ తల్లి తెగించిన విధానంను ఇప్పుడు ఆ ఊర్లో అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముంబ‌యి శివారులోని ఆరే కాలనీలో సోమవారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఛాపా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ప్రమీలా రింజాద్ రాత్రి 9 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. అయితే కూడా తన మూడేళ్ల కొడుకు ప్రణయ్ ను కూడా తీసుకెళ్లింది. అటవీ ప్రాంతం, పైగా చిమ్మచీకటి కావటంతో భయం భయంగానే వెళ్తూ ఉంది. అదే స‌మయంలో అటుగా వ‌చ్చిన ఓ చిరుతపులి దాడి చేసింది. ప్ర‌ణ‌య్‌ను పంజాతో కరుచుకుని ఈడ్చుకెళ్లింది.

అయితే, ఆ చిన్నారి కోసం చిరుతతో పోరాడేందుకు రెడీ అయిపోయింది. ఏది ఏమైనా ఫర్వాలేదు బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలనుకుని ముందుకు దూకింది. గ‌ట్టి గట్టిగా అరుస్తూ చిరుత మీదకు ఊరికింది. ఆ అరుపులకు భయపడి చిరుత పిల్లాడిని పంజా నుంచి జారవిడిచింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా ఆ పిల్లాడిని టక్కున్న లాక్కుంది ఆ తల్లి. ఆ అరుపులు అలాగే కొనసాగిస్తూ సాయం కోసం గట్టి గట్టిగా అరవటంతో బెంబేలెత్తిన చిరుత అడవిలోకి దౌడు తీసింది.

Brave Mother Fight with Leopard

స్వల్ఫ గాయాలైన ప్రణయ్ కి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, ఆపై ముంబైలోని థాక్రే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. బహిర్భూమి కోసం టాయ్ లెట్లు లేకపోవటంతో ఇలా కాస్త దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని, ఈ క్రమంలోనే తమపై జంతువుల దాడులు అధికం అవుతున్నాయని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Brave Mother  Leopard Fight  Save Son  

Other Articles