అమ్మ ఇలాకా పోటీలో రజనీ సపోర్ట్ ఎవరికంటే... | Rajinikanth clarity on his support in RK Nagar election.

Rajinikanth no support for rk nagar by election

RK Nagar By-Election, RK Nagar Election, Rajinikanth RK Nagar Election, Rajinikanth Support RK nagar Election, Rajinikanth Tweet RK Nagar Election, RK Nagar BJP candidate, BJP RK Nagar Rajinikanth

Actor Rajiikanth clearly says that no support to any one in RK nagar by-election.

ఆర్కే నగర్ ఉపఎన్నిక... రజనీకాంత్ సారీ!

Posted: 03/23/2017 10:41 AM IST
Rajinikanth no support for rk nagar by election

అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఈ స్థానంలో ఎవరైతే గెలుస్తారో వారే అమ్మ అసలైన వారసులుగా పరిగణిస్తారనే నమ్మకం ఉంది. అందుకే పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి దిగుతున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఇక్కడ నిలిపింది. ఇళయరాజా సోదరుడు, పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన గంగై అమరన్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు.

అయితే ఇక్కడ నామినేషన్ దాఖలు చేశాక అమరన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవటం పలు ఊహాగానాలకు తావునిచ్చింది. ఏ రాజకీయ పార్టీతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోని ఆయన బీజేపీ నేతలతో అప్పుడప్పుడు చర్చలు జరపటం తెలిసిందే. దీంతో ఆర్కే నగర్ ఉపఎన్నికలో రజనీ బీజేపీ అభ్యర్థిని బలపరుస్తూ ప్రచారం చేయబోతున్నాడనే టాక్ వినిపించింది.

 

అయితే తాను ఆర్కే నగర్ ఉప ఎన్నిక లో జోక్యం చేసుకోబోనని క్లారిటీ ఇచ్చాడు రజనీకాంత్. వచ్చే ఎన్నికల్లో తాను ఎవరికీ సపోర్ట్ ఇవ్వటం లేదని తేలుస్తూ గురువారం ఓ ట్వీట్ చేశాడు. కాగా, ఆర్కే నగర్ నామినేషన్ల గడువు నేటితో ముగియనుండగా, పన్నీర్ సెల్వం శ్రేణులు ఇంత వరకు ఏ అభ్యర్థిని నిలపకపోవటంతో జయ మేనకోడలు దీపకే దాదాపు మద్ధతు ఇచ్చే అంశం ఖరారైనట్లేనని రాజకీయ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Rajinikanth  RK Nagar By-election  No Support  

Other Articles