బాబు జిల్లాలోనే టీడీపీకి షాక్.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ లో మిక్స్ డ్ రిజల్ట్ | Andhra Pradesh Graduate MLC results.

Shock to tdp in graduate mlc results

MLC Election 2017 Results, TDP, YSRCP

Andhra Pradesh MLC Election Results, MLC Results, AP Graduates Results, Teacher And Draduate MLC, AP MLC 2017 Elections, TDP Gradate MLC Results, YSRCP Graduate MLC, MLC Goplareddy

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ లో టీడీపీకి దెబ్బ

Posted: 03/22/2017 10:11 AM IST
Shock to tdp in graduate mlc results

ఆంద్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షానికి గట్టి దెబ్బే పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో మూడింటికి మూడు గెలుచుకున్న తెదేపా వీటిలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో  3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు గానూ అధికార పార్టీని తిరస్కారం ఎదురుకాగా, మిత్రపక్ష సహకారంతో ఒకదానిని కైవసం చేసుకోగలిగింది.

సుమారు రెండు రోజుల పాటు జరిగిన లెక్కింపులో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో(గ్రాడ్యుయేట్స్) ఒకటి వైఎస్సార్సీపీ, ఒకటి వామపక్షాలు, మరోకటి భాజాపా-తెదేపా కూటమి విజయం సాధించాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై వైసీపీ అభ్యర్థి వీ గోపాల్‌రెడ్డి 14,146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోవైసీపీకి చెందిన అజాశర్మపై బీజేపీ-టీడీపీ అభ్యర్థి పీవీఎన్ మాధవన్ 9251 ఓట్లతో జయ కేతనం ఎగరవేశాడు.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి వామపక్షాల అభ్యర్ధి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించటం విశేషం. అనుహ్య పరిణామాల మధ్య ఆయన గెలుపు ప్రత్యేకంగా మారింది. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డిపై 3,800 ఓట్ల తేడాతో గెలిచారు.

ఇక రెండు రోజుల వచ్చిన టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీకి చుక్కెదురైందన్నది తెలిసిందే. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం 3,553 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. మొత్తానికి ఈ ఫలితాలతో మాత్రం అధికార తెలుగుదేశం పార్టీకి ఊహంచని విధంగా షాక్ తగలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles