శ్రీచైతన్య విద్యార్థుల వీరంగం.. బస్సు ధ్వంసం sri chaitanya residential students hulchul at bachupally collage

Sri chaitanya residential students hulchal at bachupally collage

sri chaitanya collage, intermiediate students, bachupally, principal, lecturers manhandled, bachupally sri chaitanya collage, inter residential collage, students hulchul bachupally

sri chaitanya residential students hulchul at bachupally collage, principal and lecturers manhandled

శ్రీచైతన్య విద్యార్థుల వీరంగం.. బస్సు ధ్వంసం

Posted: 03/19/2017 08:16 AM IST
Sri chaitanya residential students hulchal at bachupally collage

శ్రీచైతన్య ఇంటర్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఏకంగా చదువు చెప్పే గురువులపైన దాడులకు తెగబడ్డారు. ప్రిన్సిపాల్, లెక్చరర్లుతో పాటు సెక్యురిటీ గార్డును చితకబాదారు. అర్థరాత్రి విద్యార్ధులు సృష్టించిన అలజడితో కాలేజీకి మాత్రమే పరిమితం కాకుండా.. కాలేజీ ఎదురుగా వున్న రోడ్డుపై వెళ్లే వాహనాలపై కూడా వారు విరుచుకుపడ్డారు. విద్యార్థుల దాడిలో రోడ్డుపై వెళుతున్న బస్సు కూడా ధ్వంసం అయ్యింది. విద్యార్థులకు అడ్డూఅదుపు లేకుండా వీరంగం చేయడమే కాకుండా దాడిని అడ్డుకోవాలని చూసిన కానిస్టేబుల్ పై కూడా దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలుకాగా, అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరిగినా వారిని వారిళ్లకు పంపేందుకు యాజమాన్యం నిరాకరించింది. ఎంసెట్, సహా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షలు జరిగినా విద్యార్థులను తమ ఇళ్లకు పంపకపోవడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు కాలేజీలో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లను ధ్వంసం చేశారు. ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై  నిలదీసిన ప్రిన్సిపాల్, లెక్చరర్లపై కూడా దాడులకు దిగారు, అడ్డువచ్చిన సెక్యూరిటీని కూడా చితకబాదారు, అంతటితో అగకుండా కాలేజ్ బయటకు వచ్చి రోడ్డుపై వెళ్తున్న వాహానాలపై కూడా తమ ప్రతాపం చూపారు.,

అటుగా వెళ్తున్న బీట్ పోలీసులు వెళ్లి విద్యార్ధులను అడ్డుకోబోగా కానిస్టేబుల్ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు, దీంతో సమాచారం అందుకున్న పోలీసుల పెద్ద సంఖయలో కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను వారి హాస్టల్ లోనికి పంపించి.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో ప్రిన్సిపాల్ సహా లెక్చరర్లుకు కూడా గాయాలయ్యాయి. అయితే ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థులను వెనకేసుకువచ్చింది. పరీక్షలు అయిపోయిన ఆనందంలో విద్యార్థులు ఇలా ప్రవర్తించారని, ఎవరినీ గాయపరచలేదని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles