నెట్టింట్లో జయలలిత వీలునామా హల్ చల్.. ఏముందో తెలుసా.? man claims to be jayalalithaa son post on whatsapp goes viral

Man claims to be jayalalithaa son post on whatsapp goes viral

jayalalitha news, shoban babu, Traffic Ramaswamy, tamil nadu, MGR, Man claims to be Jayalalithaa's son, Madras High Court, Jayalalithaa

The man, J Krishnamoorthy, moved the court saying he was born to Jayalalithaa and the late Telugu actor Shoban Babu. Now his post on whatsapp goes viral.

నెట్టింట్లో జయలలిత వీలునామా హల్ చల్.. ఏముందో తెలుసా.?

Posted: 03/19/2017 09:11 AM IST
Man claims to be jayalalithaa son post on whatsapp goes viral

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కుమారుడిగా తనకుతాను చెప్పుకుంటున్న కృష్ణమూర్తి తానే అమ్మకు వారసుడని పేర్కోటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు న్యాయస్థానం చివాట్లు పెట్టిన తరువాత.. ఆయన తాజాగా విడుదల చేసిన జయలలిత రాసిందంటూ నెట్టింట్లో పెట్టిన వీలునామా సంచలనంగా మారింది. ఈరోడ్ జిల్లాకు చెందిన కృష్ణమూర్తి తాను జయలలిత కుమారుడినంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అందుకు సంబంధించిన రుజువులను చెన్నై పోలీస్ కమిషనర్‌కు అప్పగించాలని కోర్టు  ఆదేశించింది.

అందులో ఏముందన్న అసక్తితో అందరూ ఆ పోస్టును చదవడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించే సమయంలో హీరో శోభన్ బాబును తాను ప్రేమించానని, 1982లో వివాహం చేసుకున్నానని జయలలిత అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 15, 1985న ఇంట్లోనే బాబుకు జన్మనిచ్చినట్టు తెలిపారు. ఎంజీఆర్ అప్పుడప్పుడు తనను చూసేందుకు వచ్చేవారని, దీనివల్ల శోభన్ బాబుతో తనకు మనస్పర్థలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరం విడిపోయి జీవించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

కాగా తమ బిడ్డను తాను పెంచుకుంటానంటే సరే అన్నారని, ఆ బిడ్డ తన వారసుడని చెప్పారని అందులో పేర్కొన్నారు. తర్వాత ఓ సినిమా షూటింగ్‌లో పరిచయమైన ముత్తుచ్చు ఉండ్లీపాళయంకు చెందిన స్నేహితురాలు వసంతమణికి తన బిడ్డను ఇచ్చి పెంచి పెద్ద చేసి ఇవ్వాలని కోరామని ఆ వీలునామాలో పేర్కొన్నారు. ఈ వీలునామాను తన భర్త శోభన్ బాబు తో పాటు తాను కూడా మనస్ఫూర్తిగా రాస్తున్న వీలునామా అని జయలలిత పేర్కోన్నట్లు వుంది, అయితే ఇది నిజమా.. కాదా అన్న విషయమై పోలీసులు పరిశీలించే పనిలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  shoban babu  Traffic Ramaswamy  tamil nadu  MGR  whatsapp  

Other Articles