మిడ్ డే మీల్ మెనూ... ఎలుకలు. కుందేళ్లే వాళ్లకు గతి... | Starving Children Forced to Eat Rats Rabbits.

Ranchi news mid day meal in jharkhand villages

Mid Day Meal Scheme, Mid Day Meal Jarkhand, Jharkhand Mid Day Meal Scheme, Jharkhand Schools, Mid Day Meal Rats and Rabbits, Rats and Rabbits Mid Day Meal, Jarkhand Mid Day Meal Menu, Children Eat Rabbit, Children Eat Rats

No Mid Day Meal in Jharkhand. Pahadi villages starving children forced to eat rats and rabbits.

ఆకలికి తాళలేక ఎలుకలను తింటున్నారు

Posted: 03/17/2017 09:07 AM IST
Ranchi news mid day meal in jharkhand villages

సంక్షేమ పథకాల గురించి దంపుడు ప్రకటనలు చేసే ప్రభుత్వాలు వాటి అమలు ఎలా ఉందో పట్టించుకున్న పాపాన ఏనాడూ పోనే పోవు. అయినా మంచి జరిగితే అదంతా తమ క్రెడిట్ అని చెప్పుకుంటూ, చెడు విషయంలో మాత్రం మాకేం సంబంధం లేదు అన్న చందాన వ్యవహరించటం ప్రభుత్వాలకు కొత్తేం కాదు కదా. జార్ఖండ్ లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే దాపురిస్తున్నాయి.

రాయ్ ఘడ్ హిల్స్ లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల దుస్థితిని వివరిస్తూ ఓ జాతీయ మీడియా చేసిన డాక్యుమెంట్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. స్కూల్ భవనాలు టీచర్లు లేక ఖాళీగా ఉండటమే కాదు, అక్కడి విద్యార్థులకు తినడానికి సరైన తిండి కూడా దొరకటం లేదు. సాధారణంగా మధ్యాహ్న భోజనంలో ఎలుకలు, బొద్దింకలు తరచూ రావటం చూస్తాం. కానీ, అక్కడి పిల్లలకు ఎలుకలు, కుందేళ్లే మెనూ. వాటిని చంపుకుని తినటం లాంటి సన్నివేశాలు షాకింగ్ కు గురిచేశాయి. ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందంట.

దీనిపై పహాడి గ్రామ అధికారులు స్పందిస్తూ ప్రభుత్వం నుంచి సహకారం లేనిది తామేం చేయాలంటూ చేతులెత్తేస్తున్నారు. జార్ఖండ్ లో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. గతంలో సీఎం రఘువర్ దాస్ కూడా చాలా సార్లు పిల్లల ఎడ్యుకేషన్ గురించి పెద్ద పెద్ద సెమినార్లు నిర్వహించి ఉపన్యాసాలు దంచాడు. మరి ఇంతటి ఘోరటి పరిస్థితి పై ఎలాంటి స్పందన లేకపోవటం మాత్రం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jarkhand  Mid Day Meal Scheme  Rabbits and Rats  

Other Articles