బ్యాంకుల బ్యాడ్ టైం స్టార్టయ్యింది.. ఎలాగో చూడండి... | More savings accounts opened in Post Office after Bank Regulations.

Account holders giving shock to banks

Post Office Saving Accounts, Bank Accounts Close, Account Holders Shock to Banks, Bank to Post Office, Post Office Accounts

After Bank restrictions on Transactions a large number of people have started approaching post offices for New Accounts.

కస్టమర్ల నుంచి బ్యాంకులకు షాకులే షాకులు...

Posted: 03/15/2017 08:06 AM IST
Account holders giving shock to banks

ఏటీఎం లు నో క్యాష్ బోర్డుతో వెక్కిరిస్తున్నాయా?, మరోవైపు బ్యాంకుల అడ్డగొలు నిబంధనలతో విసిగిపోయి ఉన్నారా? ఫర్వాలేదు. మిమల్ని ఆదుకునేందుకు మేమున్నాం అంటూ పోస్టల్ డిపార్ట్ మెంట్ ముందుకు వస్తోంది. అందుకోసం మీరు చేయాల్సిన జస్ట్ వంద రూపాయలతో కొత్త ఖాతా తెరవటమే. దీంతో బ్యాంకులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలు ఇప్పుడు కొత్త అస్ర్తం దొరికినట్లయ్యింది.

ఖాతాలో కనీస మొత్తం ఆంక్షలు లేకపోవడం, గరిష్టంగా ఎంతైనా జమచేసుకునే వీలుండడంతో ఖాతాలు తెరిచేందుకు పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్, అబిడ్స్, ఖైరతాబాద్ పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. తొలుత ఖాతా తెరిచేందుకు కేవైసీ నియమాలను పాటించాలని, డబ్బు జమను బట్టి పాన్, ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పోస్టల్ అధికారులు తెలిపారు. ఖాతా తెరిచిన అనంతరం 15 రోజుల్లో ఏటీఎం కార్డు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డును ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

పెద్ద నగరాల్లో అయితే పోస్టల్ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. పైగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండటంతో తమ ఖాతాలను తరలించే పనిలో ఉన్నారు కస్టమర్లు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 5 లక్షలకు పైగా సేవింగ్ అకౌంట్లు ఉన్నాయని, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఖాతాలు తెరిచినట్టు పోస్టల్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నిజానికి మిగతా రాష్ట్రాల్లో ఈ వెసులుబాటు డిసెంబర్ నుంచే ప్రారంభం కాగా, తాజా బ్యాంకుల నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వాటి వైపు మొగ్గు చూపటం విశేషం. నోట్ల రద్దు తర్వాత నిబంధనలు, ఆంక్షల పేరిట ఖాతాదారులను ఆటాడుకున్న బ్యాంకులకు ఇప్పటికే నో ట్రాన్సాక్షన్ డే అంటూ పిలుపు రాగా, మున్ముందు కొత్త షాకులు తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banks  Transactions Limits  Account Holders  Postal Department  Savings Accounts  

Other Articles