ఆంధ్రప్రదేశ్ లో రహదారి మరోసారి నెత్తురొడింది. కృష్ణా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద అదుపుతప్పి కల్వర్టులో పడింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రహదారిపై నుంచి బస్సు ఒక్కసారిగా కిందపడడంతో అది కల్వర్టు లో పడిపోయింది. దీంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా రెండు కల్వర్ట్ ల మధ్యలో ఇరుక్కుపోవటంతో చర్యలు కష్టంగా సాగుతున్నాయి. నీళ్లు లేకపోవటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇక మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందటంతో ఆ సంఖ్య 10కి చేరింది.
ఇక ఆదాయ సముపార్జనే పరమావధిగా ప్రైవేటు ట్రావెల్స్ ఎలా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయో మరోసారి తేటతెల్లమైంది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఈ ఏసీ బస్సులో డిక్కీలో సైతం ఓ వ్యక్తి ప్రయాణిస్తుండటం గమనార్హం. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు పూర్తిగా నిండిపోవడంతో అతన్ని డిక్కీలో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డిక్కీలో వ్యక్తిని చూసి అవాక్కయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more