చేనేత ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. గెలిచాక అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తా: పవన్ Pawan emotional speech at Chenetha Satyagraham.

Pawan kalyan about ap special status at sahyagraham

Mangalagiri Chenetha Satyagraham, Janasena Pawan Kalyan, Pawan Kalyan, Mangalagiri Chenetha Satyagraham, Pawan Kalyan AP Special Status, Janasena Chenetha Satyagraham, Chenetha Ikya garjana

Janasena Head Pawan Kalyan full speech at Mangalagiri Chenetha Satyagraham.

ITEMVIDEOS:అసెంబ్లీలో చేనేత గొంతుక వినిపిస్తా: జనసేనాని

Posted: 02/20/2017 06:50 PM IST
Pawan kalyan about ap special status at sahyagraham

బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే తనకు కోట్ల ఆస్తితో సమానమన్న పవన్ తెలుగు రాష్టర్ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటానని మాటల్లో చెప్పటం కాదని, ఆచరించి చూపాలంటూ చెప్పాడు. నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మోనటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సంఘాలు నిష్పాక్షికంగా ప్రభుత్వాలు తమకు ఏం చేశాయో చెప్పాలని సూచించారు. చీర నేసే కష్టాన్ని తాను ఇప్పుడే చూశానని, అద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ఈ మేరకు నగదు బహుమతులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

చేనేత వాడుతున్నందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానన్న వపన్ వారంలో ప్రతీ ఒక్కరూ చేనేత ధరించాలని మరోసారి పిలుపునిచ్చాడు. రాజకీయాలంటే మురికి కుంపలు అంటూ కొందరు తనను ఎందుకు వచ్చావయ్యా అంటూ ప్రశ్నించారని, కానీ, లోపల నిర్మలంగా ఉన్న తాను మురికిలోకి వెళ్లినా స్వచ్ఛంగా బయటికి రాగలనంటూ చెప్పుకొచ్చాడు. చేత కానప్పుడు హామీలు ఇవ్వటం సరికాదన్న వపన్ మరోసారి ప్రత్యేక హోదాపై గళం విప్పాడు. ముందు స్టేటస్ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని మాట మార్చాల్సిన అవసరం ఏమోచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాడు.

 

2019 ఎన్నికల్లో జనసేన ఖచ్ఛితంగా పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్, తాను కూడా బరిలో నిలవనున్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. అంతేకాదు గెలిచాక అసెంబ్లీలో చేనేత తరపున గొంతుక వినిపిస్తానని పవన్ ప్రకటించటం విశేషం. ఇక ప్రజలు చిత్తశుద్ధి కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, పలువురు నేతలు తనతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కష్టాలకు నెవరని నేతల కోసం తాను చూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఎర్ర తుండువాను ధరించిన పవన్ ఇది సినిమాకు సంబంధించింది కాదని, కుల, వర్ణ, మత, బేధాలకు సంబంధం లేకుండా దీనిని ధరిస్తారంటూ తెలిపాడు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న జనసేన అధినేత చేనేత కార్పోరేషన్ ఏర్పాటు డిమాండ్ ను బలంగా వినిపించాడు. 

తాను కేవలం చేనేత కార్మికులకే కాదని, స్వర్ణ కారులకు కూడా అండగా ఉంటానంటూ ప్రకటించాడు. అన్ని రంగాల వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, గ్రాంట్స్ కోరాలంటూ డిమాండ్లు తమ ముందుకు వచ్చాయని, మార్చి 14న జనసేన వెబ్ సైట్ ను ప్రారంభిచబోతున్నామని తెలిపిన పవన్, వాటిని పరిశీలించి జనసేన భవిష్యత్ పోరాటం నిర్ణయిస్తుందని చెబుతూ భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలతో ప్రసంగం ముగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan Speech  Mangalagiri  Chenetha Satyagraham  

Other Articles