ఇస్రో శాస్త్రవేత్తల ఖ్యాతి పెరిగింది.. ప్రశంసలు కూడా..! Twitteratis Swell With Pride as ISRO blasts world record

Twitteratis swell with pride as isro blasts world record

isro public sector, isro drdo, isro psu, isro india proud, isro, isro launch, india satellite launch, isro india, india space, isro launch today, isro news, isro record launch, isro satellite launch, isro 100 satellite launch, satellite launch, satellite launch today, Indian Space Research Organisation, Andhra Pradesh, sriharikota, India news, latest news

After snapping ties with the BJP for civic polls, Shiv Sena chief Uddhav Thackeray hinted at pulling back support to the Devendra Fadanvis led government.

ఇస్రో శాస్త్రవేత్తల ఖ్యాతి పెరిగింది.. ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు

Posted: 02/15/2017 01:18 PM IST
Twitteratis swell with pride as isro blasts world record

అంతరిక్ష చరిత్రలోనే భారత్ అరుదైన రికార్డు సృష్టించింది.  ఒకే సారి 1378 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా చేర్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోగా, వారి కృషిని, శ్రమను శ్లాఘిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రపంచంలో అభివృద్ది చెందిన దేశాలు కూడా చేయలేని అరుదైన ప్రయోగాన్ని చేసి మన శాస్త్రవేత్తలు సత్తా చాటారని, ఇక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనకు ఎవరూ సాటిలేరని కూడా సోషల్ మీడియాలో నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు.

అమెరికా, యూరోప్ దేశాలతో పాటు రష్యాను కూడా ఆశ్యర్యపరుస్తూ.. వెలుగులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ37 ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఇంతకుముందు 2014లో రష్యా ఒకే సారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగానంతరం 28.42 నిమిషాలలో భూమికి 510 కిలోమీటర్ల ఎత్తు నుంచి 524 కిలోమీటర్ల ఎత్తులో ధ్రువసూర్యానువర్తన కక్ష్యలో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.

ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను.. కృషిని కోనియాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దేశ ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ37 విజయవంతంగా కక్షలోకి చేరిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ.. శాస్త్రవేత్తలను అభినందించారు. కార్టోశాట్ ఉపగ్రహం సహా మరో 103 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి.. అరుదైన ఫీట్ చేసిన ఇస్త్రో.. మరోమారు ప్రపంచం నలుదిశలా దేశం గర్వించే విధంగా చేసిందని కోనియాడారు.

చ‌రిత్రలో గుర్తుండిపోయే ఈ ప్రయోగం ఇస్రో సాధించిన మ‌రో అద్భుత విజ‌య‌మ‌ని ప్రధానిఅన్నారు. ఈ విజయంలో పాల్గోన్న శాస్త్రవేత్తలందరికీ భారతవని వందనం చేస్తుందన్నారు. ఇటు ఇస్రో శాస్త్రవేత్తలల ఘ‌న‌త‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబులు అభినందించారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని కేసీఆర్ పేర్కొన్నారు. రికార్డు సృష్టించి ఇస్రో దేశానికే గ‌ర్వకార‌ణంగా నిలిచింద‌ని చెప్పారు. ఇస్రో ఇలాంటి మ‌రిన్ని విజ‌యాలు న‌మోదు చేసుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

ఇస్రో సాధించిన ఘ‌న‌త భార‌తీయుల‌కు గ‌ర్వకార‌ణ‌మ‌ని చంద్రబాబు త‌న ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇస్రో టీమ్‌కి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ అరుదైన ఫీటులో తన సంతోషాన్ని పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపుతూనే మనం ఒకరోజు చంద్రుడి మీద అడుగుపెడతామని అశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. తనతోపాటు తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కలసి లాంచ్ చేసే శాటిలైట్ తరహాలో ఫోజు పెట్టిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isro  drdo  pslv c-37  president  pm modi  chandrababu  kcr  twitteratis  

Other Articles