శశికళ, పళనిసామిలపై కిడ్నాప్ కేసు.. పైఎత్తు వేసిన పన్నీరు.. MLA Saravanan files abduction case against sasikala, palanisamy

Mla saravanan files abduction case against sasikala palanisamy

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, palanisamy, kidnap case, mla saravanan, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

In more trouble for V K Sasikala, AIADMK MLA from Madurai, S Saravanan filed a kidnapping case against her and Palanisamy in Kuvathur Police Station.

శశికళ, పళనిసామిలపై కిడ్నాప్ కేసు.. పైఎత్తు వేసిన పన్నీరు..

Posted: 02/15/2017 02:02 PM IST
Mla saravanan files abduction case against sasikala palanisamy

అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. ఇలా చెన్నై పట్టణాన్ని వీడి వెళ్లిందో లేదో.. అంతే అమెపై మరో కేసు నమోదయ్యింది. తన ప్రత్యర్థి వర్గాన్ని పోయిస్ గార్డన్ నుంచి.. ఆ తరువాత గోల్డన్ బే రిసార్టు నుంచి ధీటుగా ఎదుర్కోన్న శశికళ.. ఇలా బెంగళూరు కోర్టులో లోంగిపోయేందుకు కదిలిన వెంటనే పన్నీరు సెల్వం వర్గం ఎత్తుకుపైఎత్తులు వేస్తుంది. ఏకంగా శశికళతో పాటు శశికళ వర్గానికి శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న పళనిసామిలను టార్గెట్ చేస్తూ.. రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

గత రెండు రోజుల క్రితం అమె వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన గోల్డన్ బే రిసార్ట్ నుంచి నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకుని పన్నీరుసెల్వం జట్టులో చేరిన మధురై (పశ్చిమ) నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శరవణన్.. తనను కిడ్నాప్ చేశారంటూ  కువత్తూర్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా తనను శశికళ, పళనిసామిలు గోల్గన్ బే రిసార్టుకు తీసుకువెళ్లి బంధించారని ఆయన పిర్యాదులో పేర్కోన్నారు. కాగా తాను చాకచక్యంగా తప్పించుకుని వచ్చినట్లు చెప్పారు.

అయితే మద్రాసు హైకోర్టు అదేశాల మేరకు ఇంతకుముందు చెన్నై పోలీసులు కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి.. ఎమ్మెల్యేలను విచారించారు. ఎవరైనా తమకు ఇష్టంలేకుండా బలవంతంగా రిసార్టుకు వస్తే తెలపాలని కూడా సూచించారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం తామంతా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చామని, తమను ఎవరూ బలవంతంగా తీసుకురాలేదని తెలిపారు. మొత్తం 112 మంది ఎమ్మెల్యేలు తాము స్వచ్ఛందంగానే వచ్చినట్లు చెప్పారంటూ హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఫిర్యాదు ఎలా వచ్చిందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  palanisamy  kidnap case  mla saravanan  AIADMK  

Other Articles