సాయంత్రంలోగా లోంగిపోవాల్సిందే.. గడువు ఇవ్వలేం.. SC to Sasikala: No more time, surrender now

Set back to sasikala sc rejects her plea says ti surrender now

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, palanisamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

The Supreme Court on Wednesday refused to give more time to AIADMK General secretary Sasikala and asked her to surrender immediately.

సాయంత్రంలోగా లోంగిపోవాల్సిందే.. గడువు ఇవ్వలేం..

Posted: 02/15/2017 10:53 AM IST
Set back to sasikala sc rejects her plea says ti surrender now

అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్థరణ కావడం.. ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందోనన్న ఉత్కంఠకు తెరపడకపోవడంతో తాను లొంగిపోయేందకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని, అందుకు అనారోగ్యాన్ని కారణంగా చూపడం.. కలసివస్తుందని భావించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కలసిరాలేదు. అమె దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అమెను సాయంత్రంలోగా లోంగిపోవాలని అదేశించడంతో అమెకు చుక్కెదురైంది.

శశికళ సహా అక్రమాస్థుల కేసులో నిందితులైన వారిని 24 గంటల్లో లోంగిపోవాలని పినాకీ చంద్రభోష్, అమితారాయ్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం క్రితం రోజున అదేశించిన విషయం తెలిసిందే. అయితే చిన్నమ్మను అదుపులోకి తీసుకునేందుకు గోల్గన్ బే రిసార్టు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు గుమ్మిగూడారు. కాగా లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కోరడంతో పోలీసులు అమెను అదుపులోకి తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో చిన్నమ్మ పిటీషన్ ను విచారించిన సుప్రీకోర్టు అమెను సాయంత్రం లోగా లోంగిపోవాలని అదేశించింది. ఇప్పటికే తీర్పును వెలువరించిన కేసులో మరింత సమయాన్ని ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో చిన్నమ్మ ఆశలు కాస్తా అడియాశలయ్యాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అశిస్తున్న మరో మంత్రి పన్నీరు సెల్వానికి ముఖ్యమంత్రి పీఠాన్ని అందిస్తారా..? లేక చిన్నమ్మ వర్గానికి చెందిన పళనిస్వామిని వరిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఈ అంశంలో అందరి దృష్టి రాజ్ భవన్ పైనే వుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ అసక్తిగా ఎదరుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  palanisamy  sendigottanyan  thambidurai  AIADMK  

Other Articles