ఇస్రో.. నాసా కా బాప్... వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్ | ISRO creates world record with 104 satellites.

Isro successfully launched 104 satellites

ISRO, ISRO World Record, India ISRO, The Indian Space Research Organisation, 104 Satellites, NASA ISRO, Polar Satellite Launch Vehicle, PSLV-C37, Satish Dhawan Space Centre, Sriharikota, CARTOSAT-2 Series, XL Variant, Modi ISRO

ISRO sets world record, launches 104 satellites into orbit in a single mission. The Indian Space Research Organisation (ISRO) will launch a record 104 satellites in one go on Wednesday morning on board a single rocket from the Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh. The space agency began the countdown for the launch of the Polar Satellite Launch Vehicle (PSLV)’s 39th flight on Tuesday after the Mission Readiness Review committee and Launch Authorisation Board gave its approval for lift off, ISRO said. Scientists had commenced filling of the propellant for the rocket, it added. The PSLV-C37/Cartosat2 Series satellite mission includes international payloads.

ITEMVIDEOS:ఇస్రో ప్రయోగం సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత్

Posted: 02/15/2017 10:01 AM IST
Isro successfully launched 104 satellites

ఇస్రో అద్భుత ప్రయోగం ఫలించింది. అంతరిక్ష పరిశోధనల్లో తొలిసారిగా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకుని ప్రపంచ రికార్డు సాధించింది. ఫలితంగా భారత కీర్తి పతాక మరోసారి జగద్వితమైంది. పీఎస్ఎల్వీ-సీ37 నిమ్ములు చిమ్ముతూ నింగికెగసి విజయవంతంగా కక్ష్యలోకి ఉపగ్రహాలను వదిలింది. సరిగ్గా 9.28 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ37 టేకాఫ్ తీసుకుంది. తనతోపాటు 104 శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. 714 కిలోల బరువున్న అత్యంత బరువైన కార్టోశాట్ 2డీ ఉపగ్రహంతోపాటు మరో రెండు దేశీ వాళీ శాటిలైట్లను, మిగతా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించటంలో ముఖ్య భూమిక పోషించింది.  

వందకు పైగా శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి పంపుతున్న నేపథ్యంలో, ప్రపంచమంతా ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తికరంగా పరిశీలించింది. 17 నిమిషాల తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోవడం ప్రారంభమై, 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. మొత్తం దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను విడిచిందని, వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయని చెప్పారు. ప్రయోగం సక్సెస్ కావటంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రయోగం ఇలా సక్సెస్ అయ్యిందో లేదో రాష్ట్రపతి, ప్రధాని, పలువురు ప్రముఖులు తమ అభినందనలు తెలియజేశారు.

ఇప్పటిదాకా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 59 ప్రయోగాలు చేసింది. అందులో 84స్వదేశీ, 79 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. 38 సార్లు పీఎస్ఎల్వీతో ఉపగ్రహాలను పంపగా అందులో 37 సూపర్ సక్సెస్ అయ్యాయి. కాగా, ఇప్పుడీ రికార్డు ప్రయోగంతో 39వది కూడా విజయవంతం కావటమే కాదు, అంతరరిక్షంలో భారత్ జైత్రయాత్ర కు అలుపు లేదని నిరూపించింది. ఇంతకు ముందు 37 ఉపగ్రహాలతో రష్యా, 27 శాటిలైట్లతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు నిలవగా, ఇప్పుడు భారత్ ఆ రికార్డును చెరిపిపడేసింది.

 

ఇస్రో ఏకైక మొనగాడు అతనే...

 

ఇస్రో చరిత్రలో మరో అద్భుతం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  104 satellites  World Record  

Other Articles