పీఏ యవ్వారంపై బాలయ్య స్పందన.. అలా చేశాడేంటి? | Balayya action against his PA.

Balayya response on his pa allegations

Hindupur TDP Leaders, Balayya Removed PA, MLA Balakrishna PA, MLA Balakrishna Shekar, PA Shekar, Chandrashekhar Naidu, Balakrishna Personal Assistant, Anantapur Politics, TDP MLAs Balakrishna, Revolt Balakrishna

TDP Leaders Revolts Against Hindupur MLA Balakrishna's PA. Later Balayya removed his PA over allegations.

పీఏ వ్యవహారంపై బాలయ్య స్పందించాడు

Posted: 02/07/2017 08:26 AM IST
Balayya response on his pa allegations

పార్టీ నేతలు కావాలో.. పీఏ కావాలో తెల్చుకోమంటూ తేల్చుకోవాలంటూ అసమ్మతి నేతలంతా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు డెడ్ లైన్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో తన వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ నాయుడు(శేఖర్)పై వస్తున్న ఆరోపణలకు బాలకృష్ణ స్పందించారు. షాడో ఎమ్మెల్యేగా మారి తన నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్న అతడిపై వేటేసినట్టు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా బాలకృష్ణకు పీఏగా ఉన్న శేఖర్, పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ వంటి వారిని కూడా పట్టించుకునే వాడు కాదని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడంటూ విమర్శలు ఉన్నాయి. బాలయ్య పీఏ కొంప ముంచేశాడు

బాలకృష్ణ మూడు నెలలకు ఓసారి నియోజకవర్గానికి రావడం, ఉన్న రెండు మూడు రోజులు ఊపిరి సలపని కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో శేఖర్ చెలరేగిపోయినట్టు సమాచారం. పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన శేఖర్ చిలమత్తూరు మండలంలో కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించడం, లక్ష రూపాయల పనికి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు శేఖర్‌పై ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయన ఆగడాలు భరించలేని పార్టీ కార్యకర్తలు వెంకట్రాముడుతో మొరపెట్టుకున్నారు. ఆయన రంగంలోకి దిగినా శేఖర్ ప్రవర్తన మారకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తారు.

మరోవైపు కొందరిని అనుచరులుగా చేసుకుని శేఖర్ కలిసి లేపాక్షిలో సొంతంగా ర్యాలీ కూడా నిర్వహించారు. దీంతో పార్టీ‌లో విభేదాలు తారాస్థాయికి చేరి శేఖర్ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. పైగా కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోవటం, దీనిపై స్పందించటం లేదంటూ పత్రికల్లో వరుస కథనాలు రావటంతో బాలయ్య తన వేగుల ద్వారా దీనిపై సమగ్ర సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది.

అనంతరం అవన్నీ నిరూపితం కావటంతో అతనిని విధుల నుంచి తొలగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రూపులను తాను సహించబోనని, పార్టీకి ఎవరైనా ఒకటేనని, తానైనా, నాయకులైనా, కార్యకర్తలైనా సమానమేనని బాలకృష్ణ పేర్కొన్నట్టు తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడంట. మరోవైపు నేడు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శేఖర్ వ్యవహారంపై కీలక నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పీఏను తొలగించండి:చంద్రబాబు

ఇక హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష‍్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ‍్యమంత్రి ఆదేశించాడు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత‍్సహించరాదని, అందరూ ఏకతాటిపై నడవాలని, ​గ్రూపు రాజకీయాలకు కారణమైన ఎవరినీ పార్టీ క్షమించదని చంద్రబాబు హెచ‍్చరించాడు. హిందూపురం టీడీపీలో కొద్దిరోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ ఆ పార్టీ అధిష్ఠానాన్ని తాకింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగిస్తూ హిందూపురం వదిలి వెళ్లిపోవాలని సోమవారం రాత్రే ఆదేశించారు.

దీంతో సోమవారం అర్ధరాత్రి హిందూపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.మంగళవారం ఉదయం బాలకృష‍్ణ, నారా లోకేష్‌ ముఖ‍్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించగా, పీఏని వెంటనే తొలగిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ముఖ‍్యమంత్రి అధికారులను ఆదేశించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindupur  MLA Balakrishna  PA Shekar  Allegations  Remove  

Other Articles