ముహూర్తం ఫిక్స్.. 7న ఉదయం 9.30 గంటలకు sasikala to sworn in as next cm on 7th

Sasikala to sworn in as next cm on 7th

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabiner minister, o.paneer selvam, deepa jayakumar, tamil nadu politics

AS After rumours prevailed, which came true, late CM Jaya lalithaa friend vk sasikala to sworn in as next chief minister of tamil nadu

ముహూర్తం ఫిక్స్.. 7న ఉదయం 9.30 గంటలకు

Posted: 02/05/2017 04:44 PM IST
Sasikala to sworn in as next cm on 7th

ఊహాగానాలే నిజమయ్యాయి. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 9.30 గంటలకు తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణం చేయనున్నారు. దీంతో తమిళనాడుకు మూడో మహిళా సీఎంగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు.

పోయెస్ గార్డెన్ లో ఆదివారం జరిగిన అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిన్నమ్మ సీఎం అయ్యేందుకు వీలుగా ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి శశికళ పేరును పన్నీరు సెల్వమే ప్రతిపాదించగా.. మంత్రులు, ఎమ్మల్యేలంతా మద్దతు పలికారు.

తమిళనాడు సీఎం జయలలిత మరణించి ఆదివారం నాటికి 60 రోజులైంది. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న జయలలిత తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత సీఎంగా పన్నీర్ సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. 60 రోజుల తర్వాత అన్నాడీఎంకే రాజకీయాలు మారిపోయాయి. పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న శశికళ.. ఇప్పుడు ఏకంగా తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles