సెల్వానికి ముచ్చట తీరింది.. చిన్నమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది Sasikala set to become Tamil Nadu Chief Minister

Sasikala set to become tamil nadu chief minister

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabiner minister, o.paneer selvam, deepa jayakumar, tamil nadu politics

Exactly two months after Jayalalithaa’s death, her long-time friend and AIADMK general secretary V.K. Sasikala was “unanimously” elected leader of the Legislature Party

సెల్వానికి ముచ్చట తీరింది.. చిన్నమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది

Posted: 02/05/2017 03:52 PM IST
Sasikala set to become tamil nadu chief minister

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ అధికార అన్నా డీఎంకేలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ త్వరలోనే తమిళనాడు నూతన ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. తమిళ రాష్ట్రానికి అమె మూడవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. ఇవాళ జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు అమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే సమావేశంలో పన్నీరు సెల్వం రాజీనామా లేఖను శశికళకు అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి శశికళను పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. దీంతో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు, మూడు రోజుల్లో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం పన్నీరు సెల్వం, శశికళ అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళ సీఎం పీఠంపై కూర్చునేందుకు పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా తన సన్నిహితులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆమె ఆదేశాల మేరకు జయలలితకు సన్నిహితులైన అధికారులు వైదొలిగారు. శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకే ఈ రోజు అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీరు సెల్వం నిరాకరిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా రాజీనామా చేసినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles