అమ్మవారి గుళ్లో ఫ్రీ వైఫై.. అపచారం కాదా? | Free internet access at Madurai Meenakshi Temple.

Free wifi at meenakshi amman temple

Madurai Meenakshi Temple, Free WiFi at Meenakshi Temple, Free WiFi Temple, Tamil Nadu Free WiFi, Goddess Meenakshi, Madurai Free WiFi, Free WiFi Service at Temple, Meenakshi Amman temple, Free WiFi India

Devotees of Goddess Meenakshi who visit the temple can now have free internet access as Wifi services are being provided on the peripheries of the temple. The Ministry of Tourism, Government of India has introduced Wifi facilities to help visitors to learn more about the history of temple, SM Sribalamurugan Tourism officer, Madurai

పవిత్ర ఆలయం.. వివాదాస్పద నిర్ణయం

Posted: 02/03/2017 10:58 AM IST
Free wifi at meenakshi amman temple

ఇందుగల దందు లేదను సందేహము వలదు. ఎందెందు వెతికినా అందందు గలదు. ప్రస్తుతం వైఫై జమానాకు ఇది సరిగ్గా సరిపోయే పద్యం. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఓవరాల్ గా షాపింగ్ మాళ్లు, స్టేషన్లు ఇలా ఎక్కడకి వెళ్లినా ముందు ఇంటర్నెట్ కోసం ఫ్రీ వైఫైకి కనెక్ట్ అయిపోతున్నారు జనాలు. జనాలకు ఆకర్షించేందుకు వారికి ఇంతకన్నా తారక మంత్రం కనిపించటం లేదు కూడా. ఇంతకు ముందు ఓ దేశంలో స్మశానంలో కూడా ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు దేవాలయాల వంతు వచ్చింది. భక్తులను కూడా ఆకర్షించేందుకు ఓ ప్రముఖ దేవస్థానం గుడి కూడా ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అయిపోతుంది. తమిళనాడు లోని ప్రముఖ మధుర మీనాక్షి దేవాలయం నిర్వాహకులు గుళ్లో ఫ్రీ వైఫ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గుళ్లో ప్రవేశ ద్వారం దగ్గర అల్రెడీ ఓ బోర్డు కూడా పెట్టేశారు. సందర్శకులు ముందుగా ఫోన్ నంబర్ ను, ఈమెయిల్ ఐడీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం నుంచే ఈ ఫ్రీ వైఫై ప్రారంభమైందని గుడి నిర్వాహకులు తెలిపారు.

ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవను తొలుత 120 ఎంబీ స్పీడ్ తో 15 నిమిషాలు మాత్రమే వాడుకునే వీలు కల్పించారు. క్లాక్ రూం దగ్గరి నుంచి గుడి దాకా ఈ ఫ్రీ వైఫై సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ముందుకు వచ్చింది. ఈ సౌకర్యాన్ని మున్ముందు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. హోటల్ రూమ్స్ బుకింగ్ దగ్గరి నుంచి గుడి మ్యాపింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకునేందుకు వీలుగానే వారికి ఈ సౌకర్యం కల్పించినట్లు చెబుతున్నారు. అయితే పలువురు పండితులు ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి గుడిలోకి ఇంటర్నెట్ అనుమతించటం ద్వారా ఏవైనా అపచారాలు కూడా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై నిర్వాహకులు స్పందిస్తూ కేవలం పరిసర ప్రాంతాల్లోనే ఇది పని చేస్తుందని, గుళ్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదన్న విషయాన్ని గమనించాలని వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madurai  Meenakshi  Amman temple  Free WiFi  

Other Articles