ములాయం, బాబాయే కాదు, సోనియా కూడా షాకిచ్చింది | Sonia Gandhi not to campaign UP Elections.

Sonia gandhi skip to up election campaign

Sonia Gandhi, Five State Elections, Sonia Gandhi Mulayam Singh Yadav, Sonia Election Campaign, Sonia Gandhi Health, UP elections 2017, Congress SP Alliance, Shivapal Yadav New Party, SP Feud, SP Congress Campaign, After Mulayam Now Sonia Gandhi

Sonia Gandhi, Listed As Top Campaigner, Will Skip All 5 States. Due to Health Reasons.

ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి మరో దెబ్బ

Posted: 01/31/2017 04:17 PM IST
Sonia gandhi skip to up election campaign

బీజేపీ హటావో నినాదాన్ని నెత్తిన వేసుకుని యూపీలో సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ కు అనుకోని చిక్కులు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె దూరంగానే ఉంటారన్న విధంగా ఆమె కార్యాలయం నుంచి సంకేతాలు వెలువడ్డాయి.

దీంతో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న రాహుల్ కే పూర్తి పగ్గాలు అప్పగించినట్లు అయ్యింది. రాహుల్ తోపాటు, తనయ ప్రియాంక, ముఖ్యమంత్రి అఖిలేష్ తో కలిసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. గతేడాది వారణాసిలో ఓ రోల్ షోలో కుప్పకూలిన సోనియా తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఆ మధ్య జరిగిన సీడబ్య్లూసీ భేటీ కూడా రాలేనని తేల్చి చెప్పింది కూడా. అయితే కేవలం అనారోగ్య సమస్యలే ఇందుకు కారణం కాదని సమాచారం. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న యూపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చెందటం, పైగా ఇప్పుడు పార్టీకి ఏమంత సానుకూలత లేకపోవటంతోనే ఆమె ఆసక్తి చూపటంలేదని తెలుస్తోంది.

Sonia Gandhi Five State Elections

ఇక ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దిక్కు అయిన ములాయం సింగ్ యాదవ్ తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయనని తేల్చి చెప్పేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎస్పీ, కాంగ్రెస్ లు షాక్ కు గురయ్యాయి. ఇప్పుడు తాజాగా సోనియాగాంధీ కూడా ప్రచారం చేయబోరనే సంకేతాలు వెలువడటంతో, కేవలం గ్లామర్ నే వాడుకుని ముందుకు వెళ్లబోతుందా? యువనేతల ఆధ్వర్యంలోని కూటమి ప్యూహం ఎలా ఉండబోతుందో చూడాలి.

మరోసారి ముసలం...

ఇదిలా ఉంటే ముసలంకు సూత్రధారి అయిన ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీలో రాజకీయ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎస్పీ నుంచి పోటీ చేస్తున్న శివపాల్ యాదవ్ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. మార్చి 11 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ కొత్త పార్టీ పెడుతానని స్పష్టం చేశారు. తిరుగుబాటు నేతలతో కలిసి పార్టీ ఏర్పాటు చేస్తానన్నారు. తనను బలహీనపరిచేందుకే తన అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress Chief  Sonia Gandhi  UP election  2017  Campaign  

Other Articles