భర్త అంటే భార్యను భరించేవాడంటూ ఓ చమత్కారం పేలుస్తుంటారు పెద్దలు. కానీ, ఇక్కడో పెద్దాయన మాత్రం ఏకంగా 130 మంది భార్యలను భరించాడంటే అతిశయోక్తి కాదు. ఒక చిన్న కుటుంబాన్ని పోషించడానికే సతమతమైపోయే రోజులివి! అలాంటిది ఓ నైజీరియన్ వృద్ధుడు ఒకరో.. ఇద్దరో కాదు.. ఏకంగా 130 మంది భార్యలతో జీవించి రికార్డుల్లోకి ఎక్కాడు కూడా. మొహమ్మద్ బెలో అబూ బకర్ ఇస్లాం నైజీరియాలోని బిడా రాష్ట్ర వాసి అయిన ఓ మతబోధకుడు. దేవుడు తనని భూమ్మీదకు పంపింది జనాభా సంతానోత్పత్తికే అని బలంగా నమ్మాడు. అందుకే ఏకంగా 130 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ఇక 93 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య కారణంతో బకర్ మొన్నే కన్ను మూశాడు. ఒక పురుషుడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చని గట్టిగా వాదించే ఆయనకు 130 మంది భార్యలు, 203 మంది పిల్లలు ఉన్నారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని ఆయన సహాయకులు చెబుతున్నారు. అక్కడి వాసులు ఆయనను ‘బాబా’గా భావిస్తారు. ఆయన రెండంతస్తుల భారీ భవనంలో నివసిస్తారు. ప్రంపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా ఆయన ఫ్యామిలీ రికార్డు సొంతం చేసుకుంది. ఆయన భార్యల్లో కొంతమంది గర్భవతులు ఉన్నారు.
2008లో ఆయన కేవలం 48 గంటల వ్యవధిలోనే 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చి వార్తల్లోకెక్కారు. అయితే, ఒకేసారి అంతమందికి ఆయన విడాకులు ఇవ్వడాన్ని ఇతర మతపెద్దలు ఖండించారు. మొహమ్మద్ బెలో అబూ బకర్ మాత్రం భగవంతుడి ఆదేశాలను పాటించడానికే తాను జన్మించానని అంటుంటాడు. కొన్నిరోజుల క్రితం తన సహాయకులతో తనకు దేవుడు అప్పగించిన పని ముగిసిందని ఆయన వ్యాఖ్యానించాడట. భార్యలను భరించే శక్తి తనకు అల్లా ప్రసాదించాడంటూ ఆ మధ్య బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బకర్ పేర్కొన్నాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more