పాత చెల్లని నోట్లను లాక్కెళ్లిన పోలీసుల సస్పెన్షన్ cyberabad commissionerate suspends three conistables

Case filled against 3 madhapur police consitables after suspension

old currency, banned notes, demonetisation, conistables, police check point, madapur police station, cyberabad commissionerate, crime news

Three conistables from madhapur police station which falls under cyberabad commissionerate have been suspended after stealing banned currency from a car.

పాత చెల్లని నోట్లను లాక్కెళ్లిన పోలీసుల సస్పెన్షన్

Posted: 01/20/2017 11:58 AM IST
Case filled against 3 madhapur police consitables after suspension

హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు వారిపై అక్రమంగా డబ్బును లాక్కెల్లినట్లు దారిదోపిడి కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు పాత నోట్లు తరలిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 8 లక్షల పాత నోట్లను బలవంతంగా తీసుకున్నారని కారు డ్రైవర్‌ ఫిర్యాదు చేయడంతో విచారించిన అధికారులు వారిన సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే ఎస్ఐ స్థాయి అధికారి లేకుండా పోలీసు కానిస్టేబుళ్లు ఎక్కడా వాహనాలను అపకూడదని, తనిఖీలను చేయకూడదని ఉన్నతాధికారులు ఇచ్చి అదేశాలను కూడా తోసిరాజుతూ మాదాపూర్ లోని కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు మాత్రం వాటిని అక్రమంగా వాహనాల తనిఖీలకు పాల్పడ్డారు. ఇలా ఆపిన ఓ కారులోనుంచి రద్దైన పాత పెద్దనోట్లు పెద్ద మొత్తంలో లభ్యం కాగా, ముగ్గురు కానిస్టేబుళ్లు వాటిని బలవంతంగా తీసుకున్నారు.

దీంతో తమ యజమానికి సమాచారం అందించడంతో అతని సూచన మేరకు స్థానిక పోలీసులకు కారు డ్రైవర్ పిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఘటనపై విచారణ జరిపించారు. అయితే విచారణలో ముగ్గురు కానిస్టేబుళ్లు అక్రమంగా డబ్బును లాక్కెళ్లారని తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ముందుగా వారిని విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు.. ఆ తరువాత వారిపై కేసును కూడా నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles