అమెజాన్ వ్యాపార వ్యూహం.. తగ్గింపు ధరలు.. లక్కీ గిప్టులు Amazon great India sale lucky draw

Amazon india s first big sale of the year starts today

Amazon Great Indian Sale, Amazon Great Indian Sale news, Amazon, amazon sale, amazing deals, lucky winners, gift coupons, Renault Kwid

Amazon Great Indian Sale is offering exciting discount on more than 100 million products across various categories, and if you are lucky, you can also win Renault Kwid

అమెజాన్ సేల్.. తగ్గింపు ధరలు.. లక్కీ గిప్టులు

Posted: 01/20/2017 12:38 PM IST
Amazon india s first big sale of the year starts today

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ ఏడాది ఆరంభంలో గ్రేట్ ఇండియా సేల్ తో మళ్లీ డిస్కౌంట్ల పండుగకు తెరతీసింది. ఇవాళ అర్థరాత్రి నుంచే ప్రారంభం కానున్న ఈ అమ్మకాలలో మునుపెన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయల సేల్స జరపాలని అమాజాన్ సంస్థ కొత్త వ్యూహానికి తెరతీసింది. గ్రేట్ సేల్ పేరుతో తగ్గింపు ధరలతో పాటు లక్కీ కూపన్లు, లక్కీ గిప్టులను ప్రకటించిన సంస్థ అదృష్టవంతులైన లక్కీ విన్నర్స్ కోసం రెనాల్ట్ క్విడ్ కారును కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే అవసరం వున్నా లేకున్నా.. తగ్గింపు ధరలు అనగానే భారతీయలు ఎగబడి మరీ కోంటారని ప్రచారమున్న నేపథ్యంలో ఈ లక్కీ కూపన్లు, లక్కీ గిప్టులతో తమ అమ్మకాలను పెంచుకునేందుక ప్రణాళికలను వేశారు. పెద్ద ఎత్తున పొదుపులు ప్రతీ ఒక్కరికి అంటూ  ప్రకటించిన ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల వెల్లువ జనవరి 20 అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు  సాగనుంది.  పాపులర్ బ్రాండ్స్పై గ్రేట్ డీల్స్ తోపాటు వెంటనే డెలివరీ సిస్టమ్ను కూడా అందిస్తోంది.

స్మార్ట్ ఫోన్లు మొదలు  డిజిటల్ కెమెరాలు, ఇతర యాక్ససరీస్ పై  వివిధ రకాల డిస్కౌంట్లు  ఆఫర్ చేస్తోంది.  దీంతోపాటు ఎస్ బీఐ  క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా  చెల్లింపులు చేసిన వారికి అదనపు ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రూ. 4,999  కు పైన చెల్లింపులు చేస్తే  అమెజాన్ వెబ్ సైట్ ద్వారా అయితే 10 శాతం,   అమెజాన్ యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాక్  అందిస్తోంది.  ఎస్ బీఐ కార్డ్ ద్వారా కనీస లావాదేవి 5వేలు.. గరిష్టంగా రూ.1,750 ల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అమెజాన్ యాప్ ద్వారా కనీస లావాదేవీ రూ.250, గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ఆఫర్ ఇస్తోంది.

అంతేకాదు  అమెజాన్  ప్రీమియం  సభ్యులకు   బంపర్ ఆఫర్  ఇస్తోంది. అంతేకాదు  ప్రైమ్ మెంబర్స్ ..నాన్  ప్రైమ్  మెంబర్స్ కంటే 30నిమిషాల ముందు టాప్  డీల్స్ ను సొంతం చేసుకునేలా ఏర్పాటు చేసింది. వినియోగదారులకు పర్యటన అనుభవాన్నిఅందించేందుకు ముసాఫిర్.కాంతో  జతకట్టింది అమెజాన్. ఈ భాగస్వామ్యంతో అమెజాన్ యాప్ ద్వారా  కొనుగోళ్లు జరిపిన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. 10 మంది  జంటలు  అన్ని ఖర్చులతో  కలిపి  ఉచిత యూరప్ ట్రిప్ గెల్చుకోవచ్చు. అంతేకాకుండా ప్రతీరోజు 10 మంది  లక్కీ విన్నర్స్ రెనాల్ట్ క్విడ్ కారును కూడా గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amazon Great Indian Sale  Amazon  amazing deals  lucky winners  gift coupons  Renault Kwid  

Other Articles