మాలి దాడి: ఒక్కడే 60 మందిని ముక్కలు చేసేశాడు | Death Toll in Mali Suicide Blast Rises to at Least 60.

Suicide blast kills 60 at north mali military camp

Mali, Car Bomb Attack, Mali Military Base, Northern Mali, Mali Military Attack, Mali Suicide Blast, Mali military camp attack, North Mali

Car Bomb Attack Leaves at Least 60 Dead on Military Base in Northern Mali.France has been aiding Malian forces to reclaim the country's north from Islamist insurgents.

కారు నిండా బాంబులతో వచ్చి పేల్చేసుకున్నాడు

Posted: 01/19/2017 08:28 AM IST
Suicide blast kills 60 at north mali military camp

ఆఫ్రికాలో ఆత్మాహుతి దాడి 60 మందిని పొట్టన బెట్టుకుంది. మాలి దేశపు ఉత్తర భాగంలోని గావో ఎయిర్ పోర్టు సమీపంలో మాజీ తిరుగుబాటుదారులు, సైనికుల స్థావరాలు ఉన్నాయి. ఈ స్థావరాల వద్దకు కారులో వచ్చిన ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

కారు నిండా బాంబులు ఉన్నట్లు, ఈ ఆత్మాహుతి దాడిలో సుమారు 60 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో తలలు, కాళ్లు చేతులు తెగిపడి పరిస్థితి భీతావాహంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

కాగా, ఈ సంఘటనపై మాలి దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కెయిటా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇక అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఘటనకు తామే కారణమని ప్రకటించుకుంది. 2012 లో మాలి ఉత్తర భాగాన్ని అల్ ఖైదా వశం చేసుకుంది. అప్పటి నుంచి ఫ్రాన్స్ ఆర్మీ సాయంతో మాలి వారిని ఏరివేసేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు దాడులు చేసుకుంటూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mali  Suicide Blast  Car Bomb Attack  60 dead  

Other Articles