పెద్ద చిచ్చు పెట్టి.. గుడ్ బై చెబుతున్నాడా? | Amar Singh indicate that he will join BJP soon.

Amar singh likely to join bjp soon

Amar Singh, Mulayam Singh Yadav, Amar Mulayam bond, Amar Singh bye to BJP, Amar Singh quit SP, Amar singh joins BJP, Amar Singh Amith Shah, Amar Singh Akilesh Yadav, Amar Singh UP politics

MP Amar singh gives indication to change party before UP election. Amar Singh likely to join BJP soon.

శకుని మామ అనూహ్య నిర్ణయం!

Posted: 01/18/2017 09:46 AM IST
Amar singh likely to join bjp soon

యాదవ కుటుంబంలో రగిలిన చిచ్చుతో అమర బంధం ముక్కలైపోనుందా?. గొడవలకు తానే కారణమని భావిస్తున్న అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నాడా?. సమాజ్ వాదీ పార్టీలో విభేదాలతో మనస్తాపం చెందిన ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నాడా?. వెరసి తన బాల్య మిత్రుడైన ములాయంకు షాకిచ్చేందుకు సిద్ధమైపోయాడా?. తాజాగా ఆయన చేసిన కామెంట్లు చూస్తే అవుననే అనుకోవచ్చు.

అయితే ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్ ను ఆయన క్రియేట్ చేస్తున్నాడు. తాను నేతాజీ మనిషినేనని చెబుతూనే, మరోవైపు అమిత్ షాతో మాట్లాడానని, బీజేపీలో చేరనున్నానని వెల్లడించారు. తన ఫిరాయింపుపై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశాడు. అయితే బీజేపీలో ఎప్పుడు చేరనున్నానన్న విషయాన్ని చెప్పని ఆయన, పార్టీ మారటం పక్కా అని, ఆ నిర్ణయం అతి త్వరలో వెల్లడిస్తానని, ములాయం తనను శత్రువుగా చూడబోరన్న విశ్వాసం తనకుందని అన్నాడు.

అఖిలేష్ యాదవ్ పై తనకెంతో ప్రేమ ఉందని, అతను ఎన్ని మాటలన్నా భరించే ఓపిక తనకుందని చెబుతూ, ప్రస్తుతం తాను అటు ములాయం వైపునగానీ, ఇటు అఖిలేష్ వైపుగానీ లేనని తెలిపారు. కాగా, ప్రస్తుతం సమాజ్ వాదీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమర్ సింగ్, ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయంలో మాత్రం ఏ వ్యాఖ్యలూ చేయలేదు.

అమర్ -ములాయం బంధం...

గతంలో ములాయం రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆంగ్ల భాషలో అనర్గళమైన పట్టు ఉన్న అమర్ అన్నీ తానై ముందుండి చూసుకునేవాడు. అప్పుడు పార్టీ పగ్గాలన్నీ ఆయన చేతుల్లోనే ఉండేవి. 2003లో ములాయం మరోసారి యూపీ సీఎంగా గద్దెనెక్కినప్పుడు యూపీ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో అమర్ సింగ్.. పారిశ్రామికవేత్తలకు యూపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిచారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జయప్రద, రాజ్ బబ్బర్ సహా స్టార్లంతా సమాజ్ వాదీలో చేరడానికి కారణం కూడా అమర్ సింగే. ములాయం అమర్ ను ఎంతగా నమ్మారంటే.. తాను ప్రధాని కావాలంటే పక్కన అమర్ ఉండి తీరాల్సిందే అన్నంతగా.

ఇక 2009లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుదుపులకు గురైంది. బయటి వ్యక్తిని తండ్రి(ములాయం) అతిగా నమ్ముతున్నారని అఖిలేశ్ ఓపెన్ గానే అమర్ పై విమర్శలు గుప్పించాడు. అఖిలేశ్ సీఎం పగ్గాలు చేపట్టడంతో ఆయన ఖాళీ చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానంలో భార్య డింపుల్ యాదవ్ పోటీకి దింపారు. అది అమర్ సింగ్ కు నచ్చక.. తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురయ్యాడు.

ఇక తిరిగి 2016లో సమాజ్ వాదీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో తన కొడుకు డామినేషన్ ను తట్టుకోలేని ములాయం అమర్ రాకతో సంతోషంగా ఫీలయ్యాడు. స్నేహితుడికి పూర్వవైభవం కల్పించడంతోపాటు, అతను చెప్పిందల్లా పాటించుకుంటూ పోయాడు. ఫలితమే కొడుకుతో వైరం, సమాజ్ వాదీలో చీలిక పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే కన్నకొడుకు నుంచి అవమానాలు ఎదురుకోవటానికి తానే కారణమని భావించిన అమర్ ఈ నిర్ణయం తీసుకున్నాడన్నది అర్థమైపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amar Singh  SP MP  BJP  

Other Articles