ఉచిత సలహా ఇవ్వరాదని తెలుసుకున్న రచయిత్రి Twitteratis slam author for asking Sushma Swaraj to stop tweeting

Twitteratis slam author for asking sushma swaraj to stop tweeting

shobhaa day sushma swaraj, sushma swaraj twiter, shobha dey, shobha twitter, shobha day twitter, sushma swaraj slams shobha

author Shobhaa De is receiving social media rant again for asking Minister of External Affairs Sushma Swaraj to stop tweeting.

ఉచిత సలహా ఇవ్వరాదని తెలుసుకున్న రచయిత్రి

Posted: 01/14/2017 01:38 PM IST
Twitteratis slam author for asking sushma swaraj to stop tweeting

ప్రముఖ రచయిత్రి  శోభాడే కి మరోమారు భంగపడ్డారు. రచయిత్రి అయి వుండి కూడా.. ఉచిత సలహాలు ఇవ్వరాదని తెలుసుకోలేకపోయారు. అంతే ఇలాంటి ఉచిత సలహాను కేంద్రమంత్రికి పరాభవం పాలయ్యారు. అయితే ఇలాంటి పరాభవాలు శోభాడేకు కొత్తేమీ కాదు. ఇటీవల రియో ​​ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, పతకాలపై వ్యాఖ్యానించి విమర్శల పాలైయ్యారు. సోషల్ మీడియాలో అమెను నెట్ జనులు విమర్శలతో ముంచెత్తడంతో కొన్నాళ్ల పాటు మౌనంగా వున్న అమె.. తాజాగా  మరోసారి ట్విట్టర్ జనాల ఆగ్రహానికి గురయ్యారు.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుద్దేశించి చేసిన ట్విట్ పై  పలువురు  మండిపడుతున్నారు.  నూతన సంవత్సరంగా సందర్బంగా... ట్వీట్స్ ఆపేసి..ప్రశాంతంగా ఉండాలనే  నిర్ణయం తీసుకోవాలంటూ  శుక్రవారం వివాదాస్పద సలహా ఇచ్చారు. దీంతో ట్విట్టరటీలు విరుచుకుపడ్డారు. నిజానికి ఆ పని చేయాల్సింది మీరేనంటూ పలువురు ట్విట్టర్ వినియోగదారులు  శోభాడేకి రిటార్ట్ ఇచ్చారు.  సుష్మ ట్విట్టర్లో చాలా చురుకుగా ఉంటూ.. విదేశాలలో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సహాయపడుతున్నారని  కొనియాడారు.

ఇలాంటి సలహాలు సమాజానికి ఏమాత్రం పనికిరావంటూ ఫైర్ అయ్యారు. ఆమెనుచూసి  అసూయ పడకుండా...సుష్మను గౌరవించాలంటూ  మరికొంత మంది సూచించారు.  కాగా  కేంద్రమంత్రి సుష్మ ఇటీవల కిడ్నీ  ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్  తరువాత  కూడా ట్విట్టర్  చురుగ్గా ఉంటూ..విదేశాల్లో ఉంటున్న భారతీయుల వీసా సమస్యలపై స్పందిస్తున్నారు. అలాగే  అమెజాన్  డోర్మాట్ల  వ్యవహారంలో సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Union Minister  kidney transplantation  Shobhaa De  tweet  Twitterati  

Other Articles