న్యాయస్థానాన్ని అశ్రయిస్తానంటున్న అజార్.. Azharuddin's nomination for HCA president rejected

Mohammad azharuddin s nomination for hca president rejected

mohammad azharuddin, azharuddin, hca president, hca azharuddin, hca azhar, hca rejects azhar nomination, cricket news, sports news

Mohammad Azharuddin’s nomination for the post of HCA president has been rejected. It was reported questions marks remained over his eligibility.

న్యాయపోరాటం చేస్తానంటున్న అజార్..

Posted: 01/14/2017 12:58 PM IST
Mohammad azharuddin s nomination for hca president rejected

హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ తిరస్కరించడంపై మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ స్పందించారు. మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. తన నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదన్న ఆయన... కేబినెట్‌ ర్యాంక్‌ పదవిలో కొనసాగుతున్న వివేక్‌ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. కార్యదర్శి పదవి విషయంలోనూ నిబంధనలు పక్కనపెట్టారని, లోథా కమిటీ నియమాలు మిగతా వారికి వర్తించవా అంటూ ప్రశ్నలు సంధించారు. క్రికెట్‌ కు మంచి చేయాలనే తాను నామినేషన్‌ వేసినట్లు పేర్కొన్నారు.

అంతకుముందు అజహరుద్దీన్‌.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి ఆయన వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. కాగా, జీవిత కాల నిషేధంపై అజహర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించినట్లు సమాచారం. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ  ప్రభుత్వ సలహాదారు వివేక్‌, జయసింహ రేసులో ఉన్నారు.

మరోవైపు నామినేషన్‌ తిరస్కరణపై అజారుద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజహర్‌పై  బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చినా హెచ్ సిఏ ఎన్నికలలో చుక్కెదురు కావడం.. తన నామినేషన్ ను తిరస్కరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అజహర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Azharuddin  HCA elections  Namination rejected  cricket  

Other Articles

Today on Telugu Wishesh