తెలంగాణ సర్కార్ కి షాకిచ్చిన సుప్రీంకోర్టు | Supreme Court Shocks Telangana Government.

Sc dismiss telangana special leave petition on brijesh tribunal

Telangana Government, Brijesh Kumar Tribunal, Krishna Water Disputes Tribunal, Telangana Supreme Court, KCR Supreme Court, Brijesh Kumar Telangana, Telangana Andhra Pradesh Krishna Water, Supreme Court dismiss Telangana petition

Telangana Government faced a massive setback in its water hunt as Supreme Court struck down its petition over Brijesh Kumar Tribunal sharing of Krishna Waters. Telangana government is arguing that the water should be divided among all the states as the division is faulty when it happened.

కేసీఆర్ సర్కార్ పై నీళ్లు చల్లిన సుప్రీం

Posted: 01/09/2017 03:35 PM IST
Sc dismiss telangana special leave petition on brijesh tribunal

న్యాయస్థానాల నుంచి వరుస షాక్ లు ఎదుర్కుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి మరొకటి తగిలింది. నీటి పంపకాల విషయంలో టీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 89ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

కృష్ణానది జలాలను పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య సమానంగా పంపిణీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. నిజానికి కేసీఆర్ ఉద్యమం సమయంలోనే ప్రభుత్వాలు ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు వినిపించలేకపోయాయని వాదిస్తూ వస్తున్నాడు. కానీ, కేంద్రం మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ ఉమ్మడిగానే జరుగుతుందని చెబుతూ వస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఉమ్మడి రాష్ట్రం నిష్పత్తిగానే పంపిణీ చేయాలని తేల్చింది.

దీంతో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టి వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles