బ్యాంకు సైట్ హ్యాక్.. ఏదీ భద్రత..? బయటపడ్డ డొల్లతనం A 22-Year-Old Hacks Bank Site In Three Hours

From a gurugram basement a 22 year old hacks bank site in three hours

hackers, bank hackers, BugsBounty, bank site hackers, online system, ethical hackers

A group of 5 computer professionals work around a huge table, engrossed in their laptops, busy trying to hack into one of India's largest banks.

బ్యాంకు సైట్ హ్యాక్.. ఏదీ భద్రత..? బయటపడ్డ డొల్లతనం

Posted: 12/30/2016 11:08 AM IST
From a gurugram basement a 22 year old hacks bank site in three hours

దేశంలో నగదు రహిత లావాదేవీలు చేపడితే అవినీతిని కోంత మేరక రూపుమాపవచ్చని భావించిన కేంద్రం.. అ దిశగా ఉద్యమంలా దేశప్రజ‌ల‌ను న‌డిపిస్తున్న క్రమంలో ఈ విధానంలో ఎంతవరకు భద్రత నెలకొంది అన్న అంశాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే నగ‌దుర‌హిత లావాదేవీలలో వున్న డొల్లతనాన్ని కేవలం మూడు గంటల వ్యవధిలో బయట పెట్టారు ఎథికల్ హ్యాకర్లు. డిజిటల్ ఎకానమీ, కాష్ లెస్ ఇండియాలలో వున్న లోపాలను సవాల్ చేశారు. కేవలం మూడు గంటల్లోనే ఓ బ్యాంకు సైట్‌ను హ్యాక్‌ చేసి 'ఇదీ మీ భ‌ద్రత' అంటూ తేల్చి చెప్పారు.

గుర్గావ్‌లోని ఎథికల్‌ హ్యాకింగ్‌ సంస్థ ప‌లు కంపెనీలకు వచ్చే హ్యాకింగ్‌ సమస్యలు, ఇతర సాఫ్ట్‌వేర్‌ సమస్యలను ప‌రిష్కరిస్తున్న సంస్థ క్యాష్ లెస్ ఎకానమీపై పరీక్షలు చేసిన బ్యాంకు సైట్లలో వున్న డోల్లతనాన్ని బయటపెట్టింది. ఐదుగురు ఎథికల్‌ హ్యాకర్లతో క‌లిసి ఈ పరీక్ష చేయించి స‌క్సెస్ అయి స‌వాలు విసిరింది. ఈ బృందంలోని 22 ఏళ్ల అత్యంత పిన్నవయస్కుడు హ్యారీ (హర్జిత్‌) అనే ఓ ఎథికల్‌ హ్యాకర్‌ ఓ బ్యాంకు వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశాడు. కేవ‌లం మూడు గంట‌ల్లోనే బ్యాంకు ఖాతాదారులు చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలకు స్పందించే రూటర్‌ను త‌న అధీనంలోకి తెచ్చుకున్నాడు.

ఈ అంశంపై హ్యారీ మాట్లాడుతూ... బ్యాంకు ఖాతాదారుల విజ్ఞప్తులను రూటరే బ్యాంకుకు ఆదేశిస్తుంద‌ని, అదే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ను న‌డిపిస్తుంద‌ని చెప్పాడు. తాను హ్యాక్‌ చేయడం ద్వారా ఆ రూటర్‌కు సంబంధించిన‌ పాస్‌ వర్డు క‌నుక్కోగ‌లిగాన‌ని, ఇప్పుడు తాను ఆ రూట‌ర్‌ను త‌న‌ ఇష్టం వచ్చినట్లుగా నియంత్రించగలనని చెప్పాడు. స‌ద‌రు బ్యాంకు ఖాతాదారుడి రిక్వెస్ట్‌ను ఇతర ప్రైవేట్‌ సైట్‌కు కేటాయించి వారి ద్వారా ఖాతాదారుడి బ్యాంకు లాగిన్‌ పాస్‌వర్డ్‌ అడిగి అన్నింటిని క‌నిపెట్టగ‌ల‌న‌ని పేర్కొన్నాడు.

ఇలా స‌ద‌రు బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల ఖాతాల నుంచి న‌గ‌దునంతా హ్యకర్లు కాజేసే అవకాశముంటుందని హ్యరీ తెలిపాడు. బ్యాంకు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి డ‌బ్బు కాజేయ‌డం త‌న‌ ఉద్దేశం కాక‌పోయినా, దేశంలోని న‌గ‌దుర‌హిత విధానం భద్రతాలోపాలనుచాటి చెప్పడానికే ఇలా హ్యాకింగ్ చేశాన‌ని అన్నాడు. ఇలా చెప్పడం ఎథికల్‌ హ్యాకర్‌గా తమ బాధ్యత అని చెప్పాడు. దీంతో కేంద్రం చెబుతున్న డిజిటల్ లావాదేవీలు, క్యాష్ లెస్ ఎకానమీల భద్రతపై ప్రజల్లో అందోళన రేకెత్తుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hackers  bank hackers  BugsBounty  bank site hackers  online system  ethical hackers  

Other Articles