అట్టహసంగా జరిగే పెళ్లి వేడుకలో అనుకోకుండా జరిగే పరిణామాలు అప్పుడప్పుడు దిగ్భ్రాంతిని కలిగిస్తుంటాయి. కానీ, ఇక్కడ విషయం మాత్రం చాలా ప్రత్యేకం. ఏకంగా పెళ్లి కూతురినే ముద్దాడాడు ఓ వ్యక్తి. అతను ఎక్స్ లవర్ కాదు. అలాగని పెళ్లి కొడుకు కూడా కాదు. ఏకంగా వరుడి తండ్రే తన కోడలు బలవంతంగా కిస్ చేసేశాడు.
చైనాలో చోటు చేసుకున్న ఘటన వివరాళ్లోకి వెళ్లితే... హెనెన్ రాష్ట్రంలోని ఓ గ్రామం. ఓ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటోంది. పెళ్లి కొడుకు తరపు బంధువులు, వధువు బంధువులతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. అంతలో ఎవరూ ఊహించని ఓ అనూహ్య సంఘటన జరిగింది.పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకు తండ్రి ఒక్కసారిగా కోడలు వద్దకు చేరుకుని ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. అంతే అక్కడున్నవారంతా షాక్.
వెంటనే కొందరు కరతాళ ధ్వనులతో పెళ్లి కుమారుడి తండ్రికి అభినందనలు తెలిపారు. ఇదంతా ఓ పందెంలో భాగంగా జరగిందంట. ఒకవేళ తన కొడుక్కి కాబోయే భార్యను కిస్ చేస్తే పదివేల యువాన్లు ఇస్తామని వారు ఛాలెంజ్ చేశారంట. అందుకే అతగాడు అలా చేశాడన తెలుస్తోంది. ఇక మామ బలవంతంగా ముద్దు పెట్టేసరికి ఆ కోడలు కంగారు పడిపోయింది. పక్కన నిలబడ్డ పెళ్లి కొడుకు అదంతా చూస్తూ ఉండిపోయాడు. అయితే తన మామ పందెంలో గెలవటంతో ఆపై సంతోషం వ్యక్తం చేసిందా కోడలు. పెళ్లి కొచ్చిన అతిథుల్లో ఒకరు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
చైనాలో నావో డోంగ్ ఫాంగ్ పేరిట ఇలాంటి ఫ్రాంక్స్ ఎక్కువయిపోయాయి. వధూవరులను ఊత్సాహపరిచేందుకు వారికి తెలియకుండా ఇటువంటి పందేలు పెట్టుకుంటారు. మరి ఇలాంటి వేధింపులు సరైనవే అంటారా?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more