పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించిన తేదీ గుర్తుందా..? నవంబర్ 8. సరిగ్గా ఆ రోజు తరువాత మీరు మీ వద్దనున్న పెద్ద నోట్లతో కారు గట్రా కోన్నారా..? అయితే మీరు వారి దృష్టిలో పడినట్లే. ఎవరంటారా.. అదాయపన్ను శాఖ అధికారులు. నవంబర్ 8వ తేదీ తర్వాత కార్లు కొనుగోలు చేసిన వారికీ నోటీసులు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేంటి ఏదో రెండున్నర లక్షల పెట్టి కారు కోన్నాం అదీ తప్పే అంటే.. తప్పేనట.
కొట్ల రూపాయలు ఖరీదు చేసే టాప్ ఎండ్ క్లాస్ కార్ల నుంచి సామాన్యుల కోసం వచ్చిన బుడ్డి కార్ల వరకు ఏ కారు కొన్నా.. అదాయపన్ను శాఖ అధికారులు పంపే శ్రీముఖాలను అందుకోక తప్పవట. నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా పలు చోట్ల విస్తృత సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ.. పెద్ద సంఖ్యలో కార్ల డీలర్ల నుంచి వచ్చిన నోట్లను పరిశీలించిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే పలువురు కారు డీలర్లకు నోటీసులను కూడా అందించింది అదాయపన్నుశాఖ.
నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు విక్రయించారనే వివరాల గురించి తెలుసుకునే పనిలో ఐటీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న కార్ల డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8 తర్వాత కార్లు కొనుగోలు చేసే వారు ఆయా తేదీలను మార్చుకుంటారనే అనుమానాన్ని కూడా సంబంధిత అధికారులు వ్యక్తం చేశారు. ఎంట్రీ పుస్తకాల్లో పాత తేదీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న కార్ల డీలర్లు..అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు అందజేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more