దొంగలను పల్టీ కోట్టించిన జీపీఎస్ చిప్ కథనాలు.. ATM robbers in net with loot intact

Atm robbers in net with loot intact

Yamuna Pushta, ROHIT NAGAR, Delhi Police, Civil Lines, ATM robbers, GPS chips, demonitization, gps chip in notes, delhi robbers

Three people were arrested at Pandav Nagar for the December 19 cash van heist. Police seized Rs 9.5 lakh stolen money and country-made pistols used in the crime.

దొంగలను పల్టీ కోట్టించిన జీపీఎస్ చిప్ కథనాలు..

Posted: 12/27/2016 04:44 PM IST
Atm robbers in net with loot intact

మీడియా కథనాలు ఒక్కోసారి విపరీతాలకు దారితీస్తే.. అనేక పర్యాయాలు మాత్రం మీడియా కథనాలతో మంచే జరుగుతుంది. ఈ సారి మీడియా కథనాలలో వచ్చిన వార్తలు ఏకంగా ముగ్గురు దొంగలను పట్టించింది. ఏటీఎంలలో డబ్బులు పెడుతున్న వ్యాన్‌ను దోచుకుని జీవితంలో స్థిరపడాలని భావించిన దొంగలకు మీడియా కథనాలు చుక్కలు చూపించాయి. వారు దొంగలించిన మొత్తం కూడా కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్లే కావడం.. సరిగ్గా కథనాలకు సరితూగుతున్నట్లుగా వుండటంతో.. దొంగలు పల్టీ కోట్టారు. పోలీసుల చేతికి చిక్కారు.

ఇంతకీ మీడియా కథనం ఏంటంటారా.. కొత్తగా ముద్రిస్తున్న నోట్లలో జీపీఎస్ చిప్ ఉందంటూ మీడియాలో జరిగిన ప్రచారం వాళ్ల కొంప ముంచింది. నిజంగా అలాంటి చిప్ ఉందేమో, దానివల్ల తాము పట్టుబడతామన్న భయంతో ఎక్కడైనా ఖర్చుపెడితే దొరికిపోతాం అనుకున్నారు.. చివరకు దొంగతనం అయితే చేశారు కానీ దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా దొంగలించిన సొమ్ము మొత్తంతో పోలీసలుకు దొరికిపోయారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

సూత్రధారి అయిన బిట్టూ (29) ఒక డిస్కం అధికారి వద్ద కారు డ్రైవర్‌..జీవితంలో స్థిరపడాలని తాను నిత్యం చూసే ఏటీఎంలలో డబ్బులు నింపే వ్యాన్లను టార్గెట్ చేశాడు. అందుకు రోహిత్ నాగర్ (19), సన్నీ శర్మ (22) అనే ఇద్దరిని తోడు తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి పలుమార్లు రెక్కీ నిర్వహించారు. తమ ప్లాన్ లో భాగంగా ముందుగా వాళ్లు ఒక మోటార్ సైకిల్ చోరీచేసి, దాని నంబర్ ప్లేట్ మార్చేశారు. డిసెంబర్ 19న క్యాష్ వ్యాన్‌ను ఫాలో అయ్యి, దాన్ని దోచుకోడానికి షకార్‌పూర్, లక్ష్మీనగర్, నిర్మాణ్ విహార్ ప్రాంతాల్లో మూడుసార్లు ప్రయత్నంచి విఫలమయ్యారు.
 
ఆ తరువాత పత్‌పర్‌గంజ్ క్రాసింగ్ వద్ద కాస్త జనం తక్కువగా ఉండటంతో గార్డును బెదిరించడానికి కాల్పులు జరిపారు. శర్మ తుపాకితో డ్రైవర్‌ను, గార్డును బెదిరించాడు. అక్కడినుంచి జాగ్రత్తగా తప్పించుకుని యమునా పుష్ట వైపు పారిపోయారు. అక్కడ బ్యాగులోంచి డబ్బులు తీసి, తమ జేబుల్లో నింపేసుకున్నారు. బ్యాగును ఓ డ్రెయిన్‌లో పారేశారు. బైకును కూడా అక్కడే వదిలేశారు. రెండు ఆటోలు మాట్లాడుకుని ఇళ్లకు వెళ్లారు. ఒక రోజు తర్వాత అంతా కలిసి హరిద్వార్ పారిపోయారు.

అయితే.. టీవీలలో ఫ్లాష్ న్యూస్ చూసి, నిజంగా కొత్త నోట్లలో జీపీఎస్ చిప్‌లు ఉన్నాయేమోనని భయపడ్డారు. ఈలోపు పోలీసులు వీళ్లను జాగ్రత్తగా గమనించారు. స్తానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజ్ ను కూడా పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం మాటు వేశారు. అయితే చిప్ వుందన్న భయంలో దోంగలించిన సోమ్ములో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ముగ్గురు దోంగలు దొంగిలించిన కారులో ఒక మాల్ వద్దకు చేరుకోగానే  అక్కడ మాటు వేసిన పోలీసులు ఎంచక్కా అరెస్టుచేసి లోపల వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonitization  gps chip in notes  delhi robbers  ATM cash van  

Other Articles