క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కు భీభత్సం. 12 మంది మృతి... ఎవరు చేశారు? | apparent terrorist attack in Berlin market.

Berlin christmas market truck attack

Berlin Christmas market, Truck Crush Berlin, Christmas market attack, Christmas market Truck, Truck Crush attack, Terror Truck attack, Christmas Terror attack, Germany Terror Attack, 12 died

12 dead in 'apparent terrorist attack' at Berlin Christmas market.

క్రిస్మస్ మార్కెట్లో మారణ కాండ

Posted: 12/20/2016 07:29 AM IST
Berlin christmas market truck attack

పవిత్ర వేడుకలను కూడా తమ దాడులకు వేదికలుగా మార్చుకోవటం ఉగ్రవాదులుగా పరిపాటిగా మారిపోయింది. పార్టీలో మునిగి చిందలేసి ప్రజలను టార్గెట్ చేసుకుని నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు బలిగొనటం మనం చూశాం. సరిగ్గా బెర్లిన్ లో ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.

బెర్లిన్‌లోని రద్దీ క్రిస్మస్ మార్కెట్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. కొనుగోళ్లతో బిజీగా ఉన్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను జర్మన్ మీడియా నిర్ధారించింది. కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చ్ వద్ద జరిగిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారని, 50 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలపగా పేర్కొంది. ఈ ఘటన వెనక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం అర్థరాత్రి దాటాక ఒక్కసారిగా ట్రక్కు దూసుకొచ్చి భీభత్సం సృష్టించింది. ఇనుప ఆయుధాలతో కూడిన దీనిని ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని దాని యాజమాని ఇది వరకే ఫిర్యాదు కూడా చేశాడు. గతంలో ఇలా ట్రక్కులను తమ మారణహోమానికి వాడుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. తాజా వీడియో పుటేజీ ద్వారా దాడికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Berlin  Truck Crush  Terror attack  Christmas market  

Other Articles