నిర్భయ భారతానికి నాలుగేళ్లు... ఏం ఒరిగింది? | Nirbhaya Day special.

Nirbhaya incident completed 4 years

Nirbhaya incident, Nirbhaya India, India Nirbhaya act, Nirbhaya 4 years, Nirbhaya day 2016, Nirbhaya Justice, More Nirbhayas in India, Nirbhaya incident Tragedy, Nirbahaya special story

Nirbhaya incident completed 4 years, Nation awaits justice.

డిసెంబర్ 16 ఏం జరిగిందో గుర్తుందా?

Posted: 12/16/2016 10:47 AM IST
Nirbhaya incident completed 4 years

డిసెంబర్ 16.. ఈ తేదీ వినగానే మొత్తం ఊగిపోతుంది. నాలుగేళ్ల క్రితం సరిగ్గా నాలుగేళ్ల క్రితం పారామెడిసిన్ చదువుతున్న ఓ అమ్మాయిని కదిలే బస్సులో కిరాతకంగా రేప్ చేసి నడిరోడ్డుపై నగ్నంగా పడేసి వెళ్లిన రోజు. వారు చేసిన దారుణానికి ప్రత్యక్ష నరకం అనుభవించిన ఆ యువతి వారం తర్వాత కన్నుమూసింది. ఆ ఘటన యావత్ దేశాన్ని కదిలించివేసింది. రాక్షసులను ఉరి తీసేయాలంటూ ఎర్రకోటలు బీటలు వారేలా యువత గర్జించింది. వారి ఆవేశాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వానికి చాలా సమయమే పట్టింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయించి నిర్భయ చట్టం తెప్పించింది. కానీ, పరిస్థితి ఏంటి? మహిళలపై అఘాయిత్యాలు ఆగాయా?

ఇలాంటి సందర్భాల్లో నిందితులను ఏం చేయలేరన్న భరోసా వారిలో పెరిగిపోయింది. చట్టంలోని లొసుగులతో తప్పించుకోవటం ప్రారంభించారు. వెరసి అత్యాచారం అన్న పదం వినని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. నిర్భయ ఘటనకు ముందు ఇలాంటి దాడులు జరిగాయి. కానీ, అవి అంతగా వెలుగులోకి రాలేదు. నిర్భయ ఘటన తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి. ఇప్పుడు పదుల సంఖ్యలో నిర్భయలుగా మారుతున్నారు.

సాలినా దేశంలో 3 వేలకు పైగానే అత్యాచార కేసులు నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతుంటే.. ఈ యేడాది ఇప్పటికే ఆ సంఖ్య 2500కి చేరింది. అందులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాకా, ముక్కు పచ్చలారని పసిప్రాయంలో ఉన్నవారు 500కి పైగానే.... పరువుపోతుందని బయటపడని వారు ఎందరో... మరి ఆ మృగాలకు సరైన శిక్ష పడేది ఎప్పుడు? మహిళలపై అఘాయిత్యాలు తగ్గేది ఎప్పుడు?

తాజాగా ఢిల్లీలోని మోదీ బాగ్ లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై సీఐఎస్ఎఫ్ కు చెందిన ఉద్యోగి అత్యాచారానికి పాల్పడడం సంచలనం రేపుతోంది. అతను అత్యాచారానికి ఉపయోగించిన కారుపై కేంద్ర హోం శాఖకు చెందిన స్టిక్కర్ ఉండడంతో ఆ వ్యక్తి కేంద్ర హోం శాఖలో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడనే అనుమానం కలుగుతోంది. అంతేకాదు రాజకీయంగా కూడా అతని విడుదలకు ఒత్తిడి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయన్న సంకేతాలు అందాయి. కానీ, యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇక అత్యాచారానికి పాల్పడ్డవారిపై నిర్భయ చట్టంపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ రేప్ ఘటనలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కఠిన శిక్షలతో వణుకుపుట్టించినప్పుడే ఇలాంటి ఘటనలు ఆగుతాయన్నది వాస్తవం అయినా ఆ దిశగా ఇంకా అడుగులు పడకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya incident  4 Years 2016  Nation wait for Justice  

Other Articles