హోంశాఖ కారులో యువతిపై అఘాయిత్యం.. Woman raped after being offered lift

Four years after nirbhaya assault girl raped in car bearing mha sticker

rape, gangrape, Moti Bagh, december 16, nirbhaya gangrape, Noida, Delhi, crime news

A 20-year-old-woman was allegedly raped in south Delhi's Moti Bagh area after the attacker offered her a lift to Noida, police said

హోంశాఖ కారులో యువతిపై అఘాయిత్యం.. లిఫ్టు ఇస్తానని దారుణం

Posted: 12/16/2016 11:00 AM IST
Four years after nirbhaya assault girl raped in car bearing mha sticker

దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల రాజధాని అన్న అప్రతిష్టను మూటగట్టుకోవడానికి మూలకారణమైన గ్యాంగ్ రేపు కేసు నిర్భయ. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు సరిగ్గా నాలుగేళ్ల క్రితం డిసెంబర్ 16న జరిగింది. ఈ అఘాయిత్యాన్ని దేశానికి చెందిన యువత అంతా ఏకమై దారుణ సామూహిక అత్యాచారాన్ని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై కూడా ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో తమ వ్యతిరేకతను తెలిపారు.

సరిగ్గా ఆ రోజు వస్తుందంటేనే అప్రమత్తంగా వుండాల్సిన పోలీసులు.. నాలుగేళ్లు గడిచిపోయాయి అంటూ ఊపిరి తీసుకుంటున్న తరుణంలో అదే తరహాలోనే మరో ఘాతుకం జరిగింది. ఉద్యగో అన్వేషణలో భాగంగా రాజధాని వలస వచ్చిన ఒక యువతిపై కారు డ్రైవర్ కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాకు చెందిన యువతి ఉద్యోగం కోసం ఢిల్లీకి వలసవచ్చింది. ఉద్యోగ ఇంటర్య్వూలకు హాజరై ఇంటికెళ్లే క్రమంలో ఏయిమ్స్ అస్పత్రి వద్దనున్న బస్టాప్ లో నిల్చోని బస్సుకోసం వేచిచూస్తుంది.

అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారుమీద కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్టిక్కర్ ఉండటంతో ప్రభుత్వానికి చెందిన వాహనమేనన్న భరోసాతో బాధితురాలు కారు ఎక్కింది. రెండు మూడు గంటల పాటు అమెను కారులో ఎక్కించుకుని తిప్పిన కారు డ్రైవర్.. ఆ తరువాత మోతీబాగ్ లోని అతని ఇంటివద్దకు కారును తీసుకెళ్లి అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. కాగా అతడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు.
 
అయితే నిందితుడు ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కారు డ్రైవర్ అని, అ కారు కూడా కానిస్టేబుల్ దేనని.. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాదని కూడా పోలీసులు తెలిపారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుడ్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. అటు బాధితురాలని కూడా వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  Moti Bagh  december 16  nirbhaya gangrape  Noida  Delhi  crime news  

Other Articles