జయలలిత కోసం పవన్ ప్రెస్ మీట్ కాన్సిల్ | Janasena press meet cancelled due to Jayalalitha's heart stroke.

Pawan kalyan press meet cancelled

Pawan Kalyan Press meet, Pawan Press Meet Cancelled, Pawan Press meet on Demonetization, Pawan Demonetization press meet cancel, Tamil Nadu Cm Jayalalitha's Cardiac arrest, Pawan Press Meet, Janasena Pree Meet Cancel

Pawan Kalyan Press meet cancelled due to Tamil Nadu Cm Jayalalitha's Cardiac arrest.

పవన్ ప్రెస్ మీట్ ఉందా? లేదా?

Posted: 12/05/2016 09:39 AM IST
Pawan kalyan press meet cancelled

నోట్ల రద్దు నిర్ణయంను అభినందించినప్పటికీ, ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కుంటున్న కష్టాలకు కారణమైన ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త అసహనంతోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ అంశంపై గళం విప్పేందుకు మళ్లీ సిద్ధమయ్యాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జనసేన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడని అధికారిక సమాచారం మీడియాకు అందింది.

అయితే ఈ మధ్యాహ్నం ప్రకటించిన మీడియా సమావేశం రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు, ఆపై అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నేడు మధ్యాహ్నం 12 గంటలకు అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల కానుండటం, అందులో ఎలాంటి వార్తయినా ఉండవచ్చన్న ఊహాగానాలతో పవన్ తన సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. తదుపరి మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని త్వరలోనే జనసేన వర్గాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. అయితే పవన్ ప్రెస్ మీట్ రద్దు విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Press meet  Jayalalitha's Cardiac Arrest  Cancelled  

Other Articles