కరుణానిధి పరిస్థితి విషమం? | Tamil Nadu ex CM Karunanidhi hospitalized.

Dmk chief karunanidhi admitted to hospital in chennai

DMK chief Karunanidhi, Karunanidhi hospitalized, Karunanidhi health, Karunanidhi health condition, Karunanidhi Cauvery hospital, Cauvery hospital Karunanidhi

DMK chief Karunanidhi admitted to Kauvery Hospital in Chennai.

ఆస్పత్రిలో కరుణానిధి... ఏం జరిగింది?

Posted: 12/01/2016 07:41 AM IST
Dmk chief karunanidhi admitted to hospital in chennai

రాజకీయ కురు వృద్ధుడు, డీఎంకే చీఫ్ క‌రుణానిధి తీవ్ర అస్వ‌స్థ‌తతో ఆస్ప్ర‌త్రిలో చేరారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. 92 ఏళ్ల ఈ మాజీ సీఎం ఆస్ప‌త్రిలో చేరార‌న్న విష‌యం తెలిసి పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఆందోళ‌న‌లో మునిగిపోయారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

కాగా, గ‌త‌ నెల‌లోనూ 92 ఏళ్ల ఆస్ప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అలర్జీ సంబంధిత సమస్యలతోనే ఆయన ఆస్పత్రిలో చేరారని, కొంత కాలం ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. 

మరోవైపు ఇప్ప‌టికే అన్నాడీఎంకే చీఫ్, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న ఆమె త్వ‌ర‌లోనే ఇంటికి చేరే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK Head  Karunanidhi health  hospitalised  

Other Articles