పాతనోట్ల ఎఫెక్ట్: చెక్కు చెల్లించి తమ్ముడి శవాన్ని తీసుకెళ్లిన కేంద్ర మంత్రి | Pays By Cheque To Get Brother's Body Released

Demonetisation hits minister sadananda gowda

Union Minister Sadananda Gowda,Demonetisation, Sadananda Gowda Demonetisation, Demonetisation hospitals, Demonetisation Union Minister

Union Minister Sadananda Gowda's family runs into cash hurdle in Karnataka hospital.

పాత కరెన్సీ దెబ్బ కేంద్ర మంత్రికి తప్పలేదు

Posted: 11/23/2016 02:51 PM IST
Demonetisation hits minister sadananda gowda

పాత నోట్ల మార్పిడికి సమయం ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ఎవరూ ధైర్యం మాత్రం చేయటం లేదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, బస్ లలో వీటిని తీసుకోవాలని ఆర్బీఐ సూచిస్తున్నప్పటికీ, వాటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. దీంతో పాత నోట్లను మార్చుకునే కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కేంద్ర మంత్రి సదానంద గౌడకి స్వయానా తెలిసివచ్చింది.

జాండీస్ తో బాధపడుతూ పది రోజుల క్రితం మంగళూరులోని కస్తూర్బా ఆస్పత్రిలో చేరిన సదానంద గౌడ సోదరుడు భాస్కర గౌడ,(54) నిన్న కన్నుమాశారు. ఇక బిల్లు చెల్లించి మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లాల్సి వుండగా, పాత నోట్లను సదానంద ఇవ్వజూపారు. బిల్లు 40,000 కాగా, 500, 1000 నోట్లను ఇచ్చేందుకు గౌడ మేనల్లుడు ప్రయత్నించాడు.

అయితే ఆసుపత్రి సిబ్బంది ఆ నోట్లను స్వీకరించేందుకు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక చెక్కిచ్చి బయటపడ్డారు. అదే సమయంలో పాత నోట్లను తీసుకోమంటూ ఆస్పత్రి నుంచి అధికారికంగా ఓ లేఖ కూడా రాయించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో పాత కరెన్సీలను తీసుకోవాల్సి వున్నప్పటికీ, ఇలా నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సదానంద తెలిపారు. అంతేకాదు ప్రధాని మోదీ యాప్ కి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేస్తానని ట్విట్టర్ లో కాసేపటి క్రితం తెలిపాడు కూడా.

అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఆ నిబంధన కేవలం ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రమే వర్తిస్తుందని, ఆర్బీఐ, కేంద్రం కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయని నొక్కి చెబుతోంది. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Union Minister  Sadananda Gowda  Brother Dead body  Cheque  Old notes  

Other Articles