మోదీజీకి సామాన్య అభిమానుల సెగ తగిలింది.. Modi briefly loses Twitter followers on demonetisation day

Modi briefly loses twitter followers on demonetisation day

Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, Rs 500,500 rupees note,1000 Rs Note,Rs 2000 new note, BJP alerted its friends on notes, Demonitization,BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Delhi Chief Minister Arvind Kejriwal is addressing the media amid the demonetisation move and crisis at ATMs across country.

మోదీజీకి సామాన్య అభిమానుల సెగ తగిలింది..

Posted: 11/12/2016 12:40 PM IST
Modi briefly loses twitter followers on demonetisation day

దేశంలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలని, నల్లధన కుబేరుల సామ్రాజ్యాలను భూస్థాపితం చేయాలని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. ఆయనకు తన అభిమానులు దూరం చేస్తుంది. అదేంటి అంటారా..? సామాజిక మాద్యమం ట్విట్టర్ లో మోడీని కోట్ల మంది దేశ ప్రజలు ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయగానే అయనను సామాన్య అభిమానుల సెగ తగిలింది. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయ పరిణామేమో కానీ ఆయనను ఏకంగా మూడున్నర లక్షల మంది అన్ ఫాలో అయ్యారు.

దీంతో నోట్ల రద్దుతో నల్లధన కుబేరులు కాకుండా మధ్య, పేద వర్గాలకు చెందిన అనేక మంది శ్రమజీవులు ఇబ్బందుల పాలవుతున్నారని తేటతెల్లం అవుతోందని. విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. సోషల్ మీడియాలో వుండాలని, కేంద్రమంత్రులు, పార్టీ నేతలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు అందుబాటులో నిలవాలని ఆయన ప్రధానిగా బాద్యతలు చేపట్టిన తొలినాళ్లలో అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రభుత్వం తీసుకున్న చర్యపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ఆ చిన్న ఇబ్బందులూ మోదీకి లక్షల సంఖ్యలో అభిమానులను దూరం చేస్తిందని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని అంటున్నారు ట్విటర్‌ విశ్లేషణలు. ఈ నెల తొలినాళ్లలో మోదీకి రోజుకు 25 వేల మంది చొప్పున ఫాలోయర్లు పెరుగుతూ వచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన ఎనిమిదో తేదీన అయితే ఆశ్చర్యకరంగా 50 వేల మంది ఫాలోయర్లు పెరిగారు. కానీ తర్వాతి రోజు అంటే తొమ్మిదిన ఒక్కసారిగా మూడు లక్షల మంది ఫాలోయర్లు తగ్గిపోయారు. ప్రస్తుతం మోదీకి ట్విటర్లో 2.43 కోట్ల మంది ఫాలోయర్లున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Prime Minister  Facebook  Twitter  War on Black Money  

Other Articles