2 వేల రూపాయల నోటు వెనక్కు..? That ‘Error’ on the New Rs 2,000 Note? Was Actually Just a Rumour

That error on the new rs 2 000 note was actually just a rumour

Rs 500 and Rs 1000, Rs 2000 Note, Error on rs 2000 note, spelling mistake on currency note, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, Rs 500,500 rupees note,1000 Rs Note,Rs 2000 new note, BJP alerted its friends on notes, Demonitization,BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

In any note, Marathi is preceded by the value written in Konkani. Which in the case of the new Rs 2,000 note is written as “don hazaar rupaiye” as well.

2 వేల రూపాయల నోటు వెనక్కు..?

Posted: 11/12/2016 01:33 PM IST
That error on the new rs 2 000 note was actually just a rumour

పెద్ద నోట్లపై వేటు వేసిన కేంద్రప్రభుత్వం.. కొత్తగా ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చిన 2వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోబోతుందా..? ఇప్పుడివే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు కారణాలను కూడా నెట్ జనులు విశ్లేషిస్తున్నారు. 2 వేల రూపాయల కరెన్సీ నోటు వెనకాల భాగంలో 15 భాషల్లో ముద్రించినప్పుడు రెండు సార్లు హిందీలో రాశారని, అయితే ఈ రెండు కూడా తప్పుగా ముద్రించారని, అందుకనే ఈ నోటును ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతుందని నెట్ జనులు ప్రచారం చేస్తున్నారు.

అయితే నిజంగానే ఈ నోటును వెనక పక్క పరిశీలించగా, 'దోన్ హజార్ రూపయా' అని ఒకసారి, 'దోన్ హజార్ రుపయే' అని మరోసారి ఉందని..  హిందీలో రాయడంలో పోరపాటు దొర్లిందని, ఇది స్పెల్లింగు మిస్టెక్ కావడంతో మొత్తం నోట్లన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని దుమారం రేగింది.  సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రచారం శృతిమించగానే ఇప్పటికే కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోటును తమ జేబుల్లో పెట్టుకున్న పలువురు అందోళన చెందుతున్నారు.
 
సోషల్ మీడియాలో ఈ తరహాలో వస్తున్న ప్రచారాలను భారతీయ రిజర్వు బ్యాంకు తోసిపుచ్చింది. రూ. 2 వేల నోటులో ఎలాంటి తప్పులు లేవని, వాటిని వెనక్కు తీసుకోవడం అన్న ప్రశ్న తలెత్తదని కూడా ఆర్బీఐ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. నోటులో ముద్రించిన భాషల ప్యానల్‌లో అసలు హిందీ లేనే లేదని. నోటుకు వెనక భాగంలో ఎడమవైపు హిందీలో రాయగా, మిగిలిన మరో 15 భారతీయ భాషలలో మాత్రమే రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా ముద్రించారు. ఆ రెండింటిలో ఒకటి మరాఠీ కాగా మరొకటి కొంకణి అని, గతంలో మరాఠీ కూడా కొంకణిలో ముద్రణ జరిగేదని, అయితే ఈ సారి భిన్నంగా ముద్రణ జరిగిందని అర్బీఐ స్పష్టం  చేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles