బీజేపితో పొత్తు పెట్టుకోం.. ఒంటిరిగా అధికారంలోకి వస్తాం Will never form government with BJP's help, says Mayawati

Will never form government with bjp s help says mayawati

Mayawati, BSP, Samajwadi party, Akilesh yadav, shivpal yadav, Taj corridor, BJP, RSS, Congress, Amit Shah, PM Modi

Mayawati said she can never forget "how the BJP government in 2003 targeted her in the Taj corridor case.

బీజేపితో పొత్తా..? అ తప్పిదం జ్ఞాపకాలను మర్చిపోలేం..

Posted: 11/05/2016 05:50 PM IST
Will never form government with bjp s help says mayawati

బీజేపీతో పొత్తు ఎప్పటికీ పెట్టుకోబోమని కుండబద్దలు కొట్టారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత‍్రి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. గతంలో బీజేపి ప్రభుత్వం అధికారంలో వుండగా, తమను పెట్టిన ఇబ్బందులను ఎప్పటికీ మర్చిపోలేమని అమె స్పష్టం చేశారు. అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని బీజేపితో పొత్తు పెట్టుకోవడం కాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాని ఎప్పుడూ చేయబోమని చెప్పారు. 2003లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజ్ కారిడార్ కేసులో తనను టార్గెట్ చేయడాన్ని ఎప్పుడూ మరచిపోనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తమ కుటుంబంపై దాడులు చేయించిందని, ఆ సమయంలో కాన్షీరామ్ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు.  

వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తమకు ఎవరి సాయం అవసరం లేదని మాయావతి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బీఎస్పీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంప్రదాయక ఓటు బ్యాంక్తో పాటు మైనార్టీలు తమ పార్టీకి అండగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మైనార్టీలు ఎస్పీకి ఓటు వేసి పొరపాటు చేశామని అర్థం చేసుకున్నారని చెప్పారు. ఎస్పీలో విభేదాలు తీవ్రమయ్యాయని, వాళ్లలో వాళ్లే కొట్లాడుతూ తీరికలేకుండా ఉన్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేది బీఎస్పీయేనని మాయావతి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mayawati  BSP  Samajwadi party  Akilesh yadav  shivpal yadav  Taj corridor  BJP  RSS  Congress  Amit Shah  PM Modi  

Other Articles