మనస్సున్న మారాజు అల్లు అర్జున్ generous allu arjun donates Rs 8 lakh for toddler liver transplantation

Generous allu arjun donates rs 8 lakh for toddler liver transplantation

Allu arjun, stylish star allu arjun, Charity, Kids, Mega Hero, chiranjeevi, liver transplantation, allu arjun on screen, allu arjun off screen, Nagaraju, Durga, 7 months old toddler, liver transplantation, charity works, allu arjun charity works, tollywood

Stlijsh star Allu Arjun is also carrying forward the legacy of his uncle megastar Chiranjeevi not only on silver screen but also off-screen, in charitable works.

మనస్సున్న మారాజు అల్లు అర్జున్.. చిన్నారికి సాయం..

Posted: 11/05/2016 05:20 PM IST
Generous allu arjun donates rs 8 lakh for toddler liver transplantation

మన హీరోలు మనస్సున మారాజులు. ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. కాదు నిజం. తెలుగు చిత్ర వెండితెరపై వెలుగొందుతున్న హీరోలు నిజంగా మనస్సున మారాజలని నిరూపించుకుంటున్నారు. అదెలా అంటే అన్ స్ర్కీన్ పై డైరెక్టర్ అదేశాల మేరకు నటించే హీరోలు.. నిజజీవితంలో మత్రం వారు చేసే చారటీ కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. అయితే తాము చేసిన చారిటీ పనులకు ప్రచారం వద్దనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. ఈ విషయాల్లో మీడియాకు మాత్రం దూరంగా వుంటూ తమ స్వచ్చంగ పనులను గోప్యంగా వుంచుతున్నారు. అయినా మీడియాకు తెలియకుండా వుంటుందా..?

సరిగ్గా అలానే జరిగింది మన స్టైలిష్ స్టార్ వ్యవహారంలో కూడా. ఆయన తాను చేసిన పనిని గోప్యంగా వుంచాలని భావించారు. కానీ మీడియా ఎట్టకేలకు కూపి లాగింది. తీగలాగితే కేవలం ఏదో సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనలే కాకుండా తమ దృష్టికి వచ్చిన సామాన్య ప్రజల సమస్యలను కూడా తీర్చేందుకు అయన ముందుకువచ్చారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ చిన్నారి కాలేయ మార్పిడి ఆపరేషన్కు సాయం చేశాడు.

భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిల 7 నెలల బాబు కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బన్నీ తన వంతుగా 8 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బు రావటంతో శుక్రవారం ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడిన స్టైలిష్ స్టార్కు బాబు తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles