ఒబామా నోట తొలిసారి ‘‘ఆ’’ మాట Obama calls supporters to go and vote, race could be close

Obama says tough fight in presidential electons between trump and clinton

US president, Barack Obama, US Presidential Poll, tough fight, hillary clinton, donald trump, democratic party, republican party

Handing Trump the authorities of the presidency would give him the power to turn some of his “twisted notions” into reality, President Barack Obama said

ఒబామా నోట తొలిసారి ‘‘ఆ’’ మాట

Posted: 11/04/2016 03:46 PM IST
Obama says tough fight in presidential electons between trump and clinton

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేకపోతు గాంభీర్యాన్ని వదలి నేతలు వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇన్నాల్లు సర్వేలపై అధారపడిన అభ్యర్థులు, వారి అనుచరగణం.. సర్వేలతో ఎంతవరకు పరుగెత్తాలో కూడా బాగా తెలిసినట్టు వుంది. అందుకనే ఏకంగా తమ మద్దతుదారులను ఓట్లు అభ్యర్థించడంలో ఎలాంటి జంకుబోంకులు లేకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు తన మద్దతును ప్రకటించిన బరాక్ ఒబామా కూడా తాజాగా అదే తరహాలో ప్రచారాన్ని నిర్వహించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో హోరాహోరీ పోరు నెలకొందని అన్నారు, డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంటుదని, ఈ తరుణంలో ఓటర్లు ఇళ్లకు పరిమితం కాకుండా.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి హిల్లరీకి అనుకూలంగా ఓట్లు వేయాలని సూచించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూడాలని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన ఫ్లోరిడాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సారి జరుగుతున్న ఎన్నికలలో ప్రతీఒక్కరు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. డెమొక్రటిక్ అభ్యర్థి అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో గెలవని పక్షంలో గత ఎనిమిదేళ్లలో అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా నిరూపయోగం అవుతుందని అన్నారు. రానున్న ఐదు రోజులు మద్దతుదారులందరూ తమ మనసుపెట్టి పనిచేయాలని కోరారు. ఈ ఎన్నికలపైనే మన భవిష్యత్ ఆధారపడి వుందని గుర్తుంచుకోవాలని ఒబామా అన్నారు. శ్వేతసౌధంలో అడుగుపెట్టే అర్హత ట్రంప్ కు లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఆయన దుందుడుకు పోకడ వ్యక్తిత్వమున్న వ్యక్తి అని, ఇలాంటి వారిని అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అనర్హులన్ని విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  US Presidential Poll  tough fight  hillary clinton  donald trump  

Other Articles